తిరుపతిలో అమరావతి రైతులకు స్వాగతం పలుకుతూ పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే అన్ని చోట్లా ఫ్లెక్సీల్లో ఎవరు ఎవరు పెట్టారో తమ ఫోటోలు ...పేర్లు వేసుకున్నారు కానీ ఓ రకమైన ఫ్లెక్సీల్లో మాత్రం ఊర్లు..పేర్లూ లేవు. దీనికి కారణం అందులో వివాదాస్పదమైన అంశాలు ఉండటమే. తిరుపతి ప్రజలు పేరుతో ఉన్న ఆ ఫ్లెక్సీల్లో  'మీతో మాకు గొడవలు వద్దు... మీకు స్వాగతం.... మాకు మూడు రాజధానులు కావాలి"  అనే మ్యాటర్ ఉంది.  తిరుపతిలో రైతులు అడుగుపెడుతున్న సమయంలో రాత్రికి రాత్రి వెలిసిన ఈ ఫ్లెక్సీలు సహజంగానే చర్చనీయాంశమయ్యాయి.


Also Read: ప్రాణం తీసిన OTS.. డబ్బులు కట్టలేక ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి..


పేరు., పార్టీ., ఇతర అంశాలు లేకుండా ఆ ఫ్లెక్సిలను ఏర్పాటు చేయడంతో ఎవరు వాటిని ఏర్పాటు చేశారనే ఆసక్తి  ప్రజల్లో ఏర్పడింది.  తిరుపతి ప్రజలు' అంటూ ఫ్లెక్సీలు తిరుపతిలో ఎటు చూసిన దర్శనమిస్తున్నాయి. అది చూసిన అమరావతి రైతులే కాదు తిరుపతి ప్రజలు కూడార వీటిని చూసి ఆశ్చర్యపోతున్నారు.  అమరావతి రైతులు మాత్రం ఇది కేవలం అధికార పార్టీ పన్నాగమని ఆరోపిస్తున్నారు. తమకు లభిస్తున్న  ఆదరణ అభిమానాలు చూడలేక., ఓర్వలేకనే ఇలాంటి కుయుక్తులకు అధికార వైసీపీ వ్యూహ రచన చేస్తోందని విమర్శిస్తున్నారు. 


Also Read: Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ మూలాలు తెలుసా.. వాళ్లు నరరూప రాక్షసులుగా ఎందుకు మారారు?


తమను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసిన... బెదిరింపులకు పాల్పడిన భయపకుండా పాదయాత్ర సాగిస్తూ వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.  పాదయాత్ర ముగింపు దశకు చేరుకోవడం.. రాయలసీమలోనూ ప్రజల మద్దతు కనిపించడంతో కొత్త కుట్రలు అమలు చేస్తున్నారని అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్ర నేటితో ముగియనుంది. సోమవారం తిరుపతికి చేరుకున్న మహా పాదయాత్ర సాయంత్రానికి అలిపిరి చేరుకోవడంతో ముగుస్తుంది.


Also Read: వివేకా కుమార్తె, అల్లుడి నుంచి ప్రాణహానీ... కడప ఎస్పీకి ఫిర్యాదు చేసిన వివేకా పీఏ కృష్ణారెడ్డి !


అలిపిరి వద్ద కొబ్బరి కాయలు కొట్టి పాదయాత్రను ముంగించనున్నారు అమరావతి రైతులు. ఇప్పటికే అన్ని ప్రతిపక్ష పార్టీలు అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపాయి. తిరుపతిలోని రామానాయుడు కల్యాణ మండపం నుంచి ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం మీదుగా రైల్వేస్టేషన్‌, కర్నాల వీధి, కృష్ణాపురం ఠాణా, ఎన్టీఆర్‌ విగ్రహం, రామచంద్ర పుష్కరిణి వద్దకు రైతుల మహా పాదయాత్ర చేరుకోనుంది. భోజనానంతరం రాములవారి గుడి, చిన్న బజారు వీధి, గాంధీరోడ్డు, నాలుగు కాళ్ల మండపం, నగరపాలక సంస్థ, తితిదే పరిపాలన భవనం, అన్నారావు సర్కిల్‌, హరేరామ హరే కృష్ణ గుడి, రుయా ఆస్పత్రి మీదుగా అలిపిరి పాదాల మండపం ముగియనుంది.  రైతుల శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతి లభించింది.  


Also Read: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ... నోటీసులు జారీ చేసిన హైకోర్టు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి