ఒక పక్క సినిమాలు, మరో పక్క పార్టీ పనులతో చాలా బిజీగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్. కుటుంబంతో గడిపేందుకు తీరికలేకుండా ఆ బిజీ షెడ్యూల్ సాగుతోంది. అంతేకాదు కరోనా కారణంగా అతని భార్య అన్నాలెజోనోవా తన స్వదేశం రష్యాకు కూడా వెళ్లలేదు. దీంతో పవన్ ఓ పదిరోజుల పాటూ అన్ని పనులను పక్కన పెట్టి కుటుంబం కోసమే సమయం కేటాయించబోతున్నట్టు సమాచారం. భార్యతో పాటూ కొడుకు మార్క్ శంకర్, కూతురు పొలెనాలతో కలిసి క్రిస్మస్ అత్తగారింటికి వెళ్లబోతున్నారట. అన్నా లెజినోవా రష్యా దేశస్థురాలన్న సంగతి తెలిసిందే.
పవన్, అన్నా లెజోనోవాలకు 2011లో పరిచయం కాగా, 2013లో పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్‌ని పెళ్లి చేసుకున్నాక అన్నా చీరకట్టుతో, బొట్టుతో తెలుగమ్మాయిలా కనిపించేందుకు ప్రయత్నించింది. మెగా కుటుంబంలో జరిగే వేడుకలకు కూడా పవన్ తరఫున ఆమెనే హాజరయ్యేది. ఇప్పుడు పవన్ రష్యాలో అత్తగారింట్లో సందడి చేయబోతున్నారు. గతంలో కూడా పవన్ చాలా సార్లు అత్తగారింటికి వెళ్లి వచ్చారు. క్రిస్మస్ తో పాటూ న్యూఇయర్ వేడుకలు కూడా పూర్తయ్యాక సంక్రాంతి కల్లా తిరిగి భారత్ కు వచ్చేసే ప్లాన్ ఉందట అతని కుటుంబం.
పవన్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాను మలయాళ సినిమా ఆధారంగా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఎలాగైనా సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తోంది చిత్రయూనిట్. కానీ మిగతా సినిమాల వారు మాత్రం కొన్ని రోజుల పాటూ వాయిదా వేసుకోమని కోరుతున్నారట. దానికి పవన్ ఒప్పుకోవడం లేదని సమాచారం.
సంక్రాంతికి రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్ విడుదల కాబోతున్నాయి. ఏదైనా పెద్ద సినిమా విడుదలయ్యాక రెండు వారాల పాటూ ఏ సినిమా విడుదల కాకపోతేనే కలెక్షన్లు బావుంటాయి. అందుకే భీమ్లానాయక్ ను వాయిదా వేసుకోమని కోరుతున్నారు కొంతమంది దర్శకులు, నిర్మాతలు. ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: మహేష్ మోకాలికి సర్జరీ... రెండు రోజుల్లో మూడు దేశాలు తిరిగారు!
Also Read: మళ్లీ ఇటువంటివి జరగనివ్వను... అభిమానులకు అల్లు అర్జున్ హామీ!
Also Read: పుష్ప రాజ్.. 'స్పైడర్ మ్యాన్'ని బీట్ చేయగలడా..?
Also Read: సమంత ఐటెం సాంగ్.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్..
Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి