ఈ వారంలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాతో పాటు హాలీవుడ్ సినిమా 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' కూడా విడుదల కాబోతుంది. బన్నీ సినిమా కంటే ఒకరోజు ముందుగానే స్పైడర్ మ్యాన్ రాబోతున్నాడు. మార్వెల్ సంస్థ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ సినిమాల్లో 'స్పైడర్ మ్యాన్' ఫ్రాంచైసీ ఒకటి. ఈ సిరీస్ లో సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాలకు క్రేజ్ ఉంది.
మన దేశంలో కూడా మార్వెల్ సినిమాలకు అభిమానులు ఉన్నాయి. 'అవెంజర్స్' సినిమా ఇక్కడ ఎంతలా ఆడిందో తెలిసిందే. ఇప్పుడు 'స్పైడర్ మ్యాన్' సినిమాకి కూడా బుకింగ్స్ అదే రేంజ్ లో జరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఉన్న పాపులర్ థియేటర్ ప్రసాద్ మల్టీప్లెక్స్ ఇప్పటివరకు 8500 టికెట్లను అమ్మింది. దాని విలువ రూ.23 లక్షలని తెలుస్తోంది. త్రివేండ్రంలో ఓ థియేటర్లో రూ.17 లక్షల విలువైన ఏడు వేల టికెట్లను అమ్మినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి సౌత్ ఇండియాలో 'స్పైడర్ మ్యాన్'కి ఉన్న క్రేజ్ ఏంటో అర్ధమవుతోంది.
ఈ సినిమాతో ఇప్పుడు బన్నీ పోటీ పడాల్సి వస్తోంది. తొలిసారి ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నాడు బన్నీ. ఇప్పటివరకు ఈ సినిమాకు రూ.200 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను భారీ రేట్లకు అమ్మారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
'స్పైడర్ మ్యాన్' సినిమాతో 'పుష్ప' సినిమాను పోలిస్తే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప' సినిమా బాగా ఆడే ఛాన్స్ ఉంది. కానీ నేషనల్ వైడ్ గా మాత్రం 'స్పైడర్ మ్యాన్' సత్తా చూపించడం ఖాయం. నిజానికి ఇప్పటివరకు 'పుష్ప' సినిమాను వేరే భాషల్లో ప్రమోట్ చేయలేదు. ఒక్క హైదరాబాద్ లో మాత్రమే ఈవెంట్స్ నిర్వహించారు. సరైన ప్రమోషన్స్ లేని కారణంగా నార్త్ లో ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. ఇప్పటివరకు అయితే 'పుష్ప' కంటే 'స్పైడర్ మ్యాన్' సినిమాకే ఎక్కువ క్రేజ్ ఉన్నట్లు కనిపిస్తోంది. మరి రిలీజైన తరువాత ఈక్వేషన్స్ ఏమైనా మారుతాయేమో చూడాలి!
Also Read:సమంత ఐటెం సాంగ్.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్..
Also Read:బన్నీతో సమంత 'నాటు' స్టెప్.. ఊరమాస్ ఉందే..
Also Read: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?
Also Read: ఇది కేవలం జెర్సీ మాత్రమే కాదు.. నాగచైతన్య ఎందుకు అలా అన్నాడంటే?
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ చూసి రామ్, భీమ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి