AP Telangana Latest News: డిసెంబర్ 28 నుంచి కీలక పథకం అమలు- లీక్ ఇచ్చిన భట్టి విక్రమార్క
తెలంగాణలో కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో చాలా స్పీడ్‌గా ఉంది. వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల టైంలో ప్రచారం చేసింది. అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన నాడే మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం ఫైల్‌పై సంతకం చేశారు. ఆ పథకాన్ని సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9న స్టార్ట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసుకునే వెసులుబాటు కల్పించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కేసులపై ఎవరూ మాట్లాడొద్దు - చంద్రబాబు, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. బర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆస్రయించారు. చంద్రబాబు కేసుల విషయంలో ఇరు వర్గాలు ఎటువంటి వాఖ్యలు చేయొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అయితే చంద్రబాబు కేసులకు సంబంధించిన వ్యాఖ్యలను బయట చేస్తున్నారని.. ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టు ఎదుట వాదించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
గ్రేటర్ పరిధిలో ముగ్గురు పోలీస్ కమిషనర్ల బదిలీ - డీజీ ఆఫీస్‌కు స్టీఫెన్ రవీంద్ర అటాచ్ !
తెలంగాణ పోలీస్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కీలకమైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సైబరాబాద్ సీపీగా అవినాశ్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్‌బాబును నియమించింది. హైదరాబాద్ పాత సీపీ సందీప్ శాండిల్యను నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్‌గా బదిలీ చేసింది. ఇప్పటి వరకూ సైబరాబాద్ సీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర , రాచకొండ సీపీగా ఉన్న దేవేంద్ర సింగ్ చౌహాన్‌లను డీజీపీ ఆఫీస్‌కు ఎటాచ్ చేశారు. నిజానికి హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను ఎన్నికల కోడ్ ప్రారంభమయ్యాక ఈసీ బదిలీ చేసింది. ఆయన స్థానంలో సందీప్ శాండిల్యను నియమించారు. ఇప్పుడు ఆనయకూ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్ గా బదిలీ ఆదేశాలు అందాయి. సీఎం రేవంత్ రెడ్డి.. డ్రగ్స్ విషయంలో పూర్తి స్థాయిలో కట్టడి చర్యలు తీసుకోవాలనుకుంటున్నందున సందీప్ శాండిల్యకు కీలకమైన బాధ్యతలే వచ్చాయని భావిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్-ఇకపై జీతాలతోపాటే అలవెన్సులు
ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. వైనాట్ 175 అన్న టార్గెట్ పెట్టుకుని దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా... ఓవైపు పార్టీలో మార్పులు చేర్పులు చేసుకుంటోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జులను మారుస్తోంది. మరోవైపు పలు రంగాల్లో సమస్యలపై ఫోకస్ పెట్టింది. పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపింది. ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
45 కోట్ల రూపాయల అప్పులు చెల్లించండి- జీవన్‌రెడ్డికి అధికారుల నోటీసులు
బీఆర్‌ఎస్‌నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న అప్పు చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. తీసుకున్న 20 కోట్లు వడ్డీ 25 కోట్లు మొత్తం 45 కోట్లు చెల్లించాలని తెలియజేశారు. మూడు రోజుల క్రితమే జీవన్ రెడ్డి భార్య ఎండీగా ఉన్న మాల్‌కు ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు నోటీసులు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే రెండు షాక్‌లు ఆయనకు తగిలాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి