Andhra Pradesh Telangana News Updates - పెట్టుబడుల కోసం అమెరికాకు రేవంత్ రెడ్డి - ఆగస్టు మొదటి వారంలో పయనం !
 తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల్ని ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లనున్నారు. అధికారులు, మంత్రుల బృందంతో ఆయన ఆగస్టు మూడో తేదీన అమెరికాకు బయలుదేరుతారు. అమెరికాలోని పలు నగరాల్లో పర్యటించి మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు.  పలు కంపెనీల సీఈఓ లు, పారిశ్రామికవేత్తలను కలసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత  ఆగస్టు 11న హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి



బీఆర్ఎస్‌తో పొత్తు, విలీనంపై బీజేపీలో విభజన - ముగ్గురు ఎంపీల తీవ్ర వ్యతిరేకత ?
భారత రాష్ట్ర సమితి పార్టీ బీజేపీలో విలీనం లేదా పొత్తు కోసం చర్చలు పూర్తయ్యాయని కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. కేటీఆర్, హరీష్ రావు ప్రత్యేకంగా వారం రోజుల పాటు  ఢిల్లీలో మకాం వేసి వచ్చిన తర్వాత ఈ ప్రచారం ఊపందుకుంది. అయినా బీఆర్ఎస్ వైపు నుంచి ఖండన ప్రకటనలు రావడం లేదు. ఢిల్లీలో చర్చలు జరిపారని భావిస్తున్న హరీష్ రావు, కేటీఆర్ సైలెంట్ గా ఉండటంతో ఆ చర్చలు నిజమని అందరూ నమ్ముతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఆచూకీ తెలియని నర్సాపురం ఎంపీడీవో - కుటుంబసభ్యులతో మాట్లాడిన చంద్రబాబు
నర్సాపురం ఎంపీడీవో మిస్సింగ్ మిస్టరీ వ్యవహారం సస్పెన్స్ గా ఉంది. ఏలూరు కాల్వలో ఆయన దూకారేమోనన్న అనుమానంతో నాలుగు రోజుల పాటు గజ ఈతగాళ్ల సాయంతో గాలించారు. అయినా  ప్రయోజనం లేకపోయింది. ఉద్యోగంలో ఒత్తిళ్లు, వైసీపీ నాయకులు కాంట్రాక్ట్ తీసుకున్న ఓ జల రవాణా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం పైగా బెదిరింపులకు పాల్పడటంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారని కుటుబంసభ్యులు చెబుతున్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.5 లక్షల వరకూ వ్యక్తిగత రుణాలు
ఏపీ ప్రభుత్వం (AP Government) మహిళలకు మరో గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధమవుతోంది. డ్వాక్రా సంఘాలకు (Dwakra Groups) మరింత చేయూతనిచ్చేలా అడుగులు వేస్తోంది. పొదుపు సంఘాల్లోని మహిళల జీవనోపాధి కల్పనకు బ్యాంకుల ద్వారా ఇస్తోన్న గ్రూప్ రుణాలతో పాటు వ్యక్తిగత రుణాలు సైతం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షన్నర మంది డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు రూ.2 వేల కోట్ల మేర వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని సెర్ప్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సెక్రటేరియట్ ఉద్యోగుల్లో కోవర్టులు - విచారణ జరుపుతున్న ఏపీ సీఎంవో !
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కొంత మంది ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా బిజినెస్ రూల్స్ ఉల్లంఘిస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల జీవోలు, గెజిట్స్ విడుదల చేయడం వెనుక భారీ కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. ఇప్పటికీ గత ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు అమలవుతున్నాయి. వాటిని నిలిపి వేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి