Englands Bazball Aggression:  ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌(వWI)తో  జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్(Eng) బ్యాటర్లు  విరుచుకుపడ్డారు. టెస్ట్‌ క్రికెట్‌ను టీ 20 క్రికెట్‌గా మార్చేసిన బ్రిటీష్‌ బ్యాటర్లు 147 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అరుదైన రికార్డును నెలకొల్పారు. గతంలో తాము రికార్డును మళ్లీ వారే బద్దలు కొట్టారు. ఆరంభం నుంచే విండీస్‌ బౌలర్లను ఊచకోత కోసి భారీ స్కోర్లు కూడా నమోదు చేశారు. 


నయా రికార్డు 

బెన్ డకెట్(Ben Duckett) , ఆలీ పోప్‌(ollie pope) ల విధ్వంసంతో ఇంగ్లాండ్‌ 147 ఏళ్ల  టెస్ట్‌ చరిత్రలో అరుదైన రికార్డును సృష్టించింది. 4.2 ఓవర్లలోనే ఇంగ్లాండ్‌ జట్టు 50 పరుగుల మైలురాయికి చేరుకుంది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ జట్టు 27 బంతుల్లోనే 50 పరుగుల మార్క్‌ను చేరుకోవడం ఇదే తొలిసారి. ఇలా చేయడం ద్వారా 1994లో ఓవల్‌లో దక్షిణాఫ్రికాపై 4.3 ఓవర్లలో 50 పరుగులు చేసిన తమ రికార్డును  ఇంగ్లండ్ జట్టే మళ్లీ బద్దలు కొట్టింది. 

 


 

టెస్ట్ క్రికెట్‌లో వేగవంతమైన 50లు చేసిన జట్లు 

4.2 ఓవర్లు - ఇంగ్లాండ్ vs WI, నాటింగ్‌హామ్, 2024 ‍(ఇంగ్లాండ్)

4.3 ఓవర్లు - ఇంగ్లాండ్ vs SA, ది ఓవల్, 1994 (ఇంగ్లాండ్)

4.6 ఓవర్లు - ఇంగ్లండ్ vs SL, మాంచెస్టర్, 2002 (ఇంగ్లాండ్)

5.2 ఓవర్లు - శ్రీలంక vs PAK, కరాచీ, 2004 (శ్రీలంత)

5.3 ఓవర్లు - భారతదేశం vs ENG, చెన్నై, 2008(భారత్‌)

5.3 ఓవర్లు - భారత్ vs WI, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, 2023 ‍(భారత్‌)






 

మ్యాచ్‌లో సాగిందిలా...

రెండో టెస్టులో వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులోనూ పరాజయంపాలైన విండీస్‌ ఈ మ్యాచ్‌లో గెలవాలని భావించింది. అయితే ఇంగ్లాండ్‌ ముందు ఆ ఆటలు సాగలేదు. ఇంగ్లాండ్‌ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలి ఓవర్‌లోనే వికెట్‌ తీసిన విండీస్‌ బౌలర్‌ అల్జారీ జోసెఫ్ వికెట్‌ తీయడంతో కరేబియన్లు రాణిస్తారనే అంతా అనుకున్నారు. అయితే డకెట్‌, ఒలిపోప్‌ ముందు ఈ ఆటలు సాగలేదు. వీరిద్దరూ కలిసి కేవలం 4.2 ఓవర్లలోనే 50 పరుగులు జోడించారు. డకెట్‌ 71 పరుగులు చేసి అవుటవ్వగా... ఓలి పోప్‌ భారీ సెంచరీ చేశాడు.  121 పరుగులు చేసి ఇంగ్లాండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. బెన్‌స్టోక్స్‌ 69, క్రిస్‌ ఓక్స్‌ 37 పరుగులు చేయడంతో బ్రిటీష్‌ జట్టు 416 పరుగులకు ఆలౌట్‌ అయింది. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ ఇంకా ఆరంభం కాలేదు.