రాబోయే ప్రేమికుల రోజు మాత్రం పూజా హెగ్డే (Pooja Hegde)కు ఇంతకు ముందు ఉన్నట్టు, మూమూలుగా ఉండబోదని మాత్రం వందకు వంద శాతం బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. లవర్స్ డే అంటే క్యూట్, రొమాంటిక్ మూవీస్ గుర్తు వస్తాయి కదా! కానీ, ఈసారి ఆవిడకు వయలెంట్ యాక్షన్ సినిమా గుర్తుకు వస్తుంది. అటువంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...


'దేవ' విడుదల వాయిదా... ప్రేమికుల రోజున!
షాహిద్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'దేవ'. ఈ ఏడాది ఆయన 'తేరి బాతోమ్ మే ఐసా ఉల్జా జియా'తో విజయం అందుకున్నారు. కృతి సనన్ హీరోయిన్ రోల్ చేసిన ఆ సినిమా సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ. డిఫరెంట్ జానర్, కాన్సెప్ట్ ఫిల్మ్ 'దేవ'తో మరొక విజయం అందుకుంటారని అభిమానులు, ప్రేక్షకులు ఆశించారు. అయితే... వాళ్ళను డిజప్పాయింట్ చేసే న్యూస్ ఇది. 


'దేవ'ను ఈ ఏడాది అక్టోబర్ 11న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఈ సినిమా విడుదల వాయిదా పడిందని ఇవాళ తెలిపారు. లేట్ అయినా సరే మంచి రిలీజ్ డేట్ సెట్ అయ్యింది. వచ్చే ఏడాది ప్రేమికుల రోజున... ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేస్తామని షాహిద్ కపూర్ తెలిపారు. 'గెట్ రెడీ ఫర్ వయలెంట్ వేలంటైన్స్ డే' అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.


Also Readబహిష్కరణ రివ్యూ: Zee5 OTTలో లేటెస్ట్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ - అంజలి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?






రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్న పూజ!
'దేవ' విడుదల కోసం బుట్ట బొమ్మ పూజా హెగ్డే, ఆమె అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ 'రాధే శ్యామ్' నుంచి సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' వరకు ఆమె నటించిన సినిమాలు ఏవీ ఆశించిన విజయాలు సాధించలేదు. పైగా, ఆవిడ సినిమా థియేటర్లలోకి వచ్చి ఏడాది దాటింది.


Also Readభక్తులకు పూనకాలు తెప్పించేలా 'రం రం ఈశ్వరం'... 'శివం భజే'లో తొలి పాట విన్నారా?



ఇప్పుడు 'దేవ'తో కూడా వెనక్కి వెళ్లడంతో ఆల్మోస్ట్ రెండేళ్ల విరామం తర్వాత పూజా హెగ్డే కొత్త సినిమాతో థియేటర్లలో సందడి చేయాల్సిన పరిస్థితి. అందుకని, ఆమెకు ఈ సినిమా విజయం చాలా కీలకం. ఇది కాకుండా సూర్యతో మరొక సినిమా చేస్తున్నారు పూజా హెగ్డే. ఈ రెండూ సక్సెస్ కావడం ఆమెకు చాలా ఇంపార్టెంట్.


Also Readడార్లింగ్ సినిమా రివ్యూ: ప్రియదర్శిని చితక్కొట్టిన నభా నటేష్ - అపరిచితురాలు ఎలా ఉందంటే?