ఒకవైపు హాస్య నటుడిగా, మరోవైపు కథానాయకుడిగా వరుస విజయాలతో దూసుకు వెళుతున్న ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda) నటించిన తాజా సినిమా 'డార్లింగ్'. ఇందులో ఆయనది హీరో రోల్. ఎట్ ద సేమ్ టైమ్... ఆయన నుంచి ఆడియన్స్ ఆశించే కామెడీ మిస్ కాకుండా చూసుకున్నారు. ప్రియదర్శి సరసన నభా నరేష్ (Nabha Natesh) కథానాయికగా నటించారు. కొంత విరామం తర్వాత ఆవిడ నటించిన చిత్రమిది. ఈ రోజు (శుక్రవారం, జూలై 19న) థియేటర్లలో విడుదల అయ్యింది. మరి, ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా?


డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ ఓటీటీలో...
Disney Plus Hotstar bags Darling 2024 movie digital streaming rights: 'డార్లింగ్' (2024) సినిమా విడుదలకు ముందు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు అయ్యాయి.


'డార్లింగ్' ఓటీటీ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. శాటిలైట్ రైట్స్ కూడా 'స్టార్ మా' ఛానల్ తీసుకుంది. ప్రియదర్శి, హాట్ స్టార్ ఓటీటీది సూపర్ హిట్ కాంబినేషన్. ఆయన ఓ హీరోగా నటించిన 'సేవ్ ద టైగర్స్' వెబ్ సిరీస్ ఫ్రాంచైజీ అందులో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ప్రియదర్శి హీరోగా నటించిన సినిమాను సైతం స్టార్ గ్రూప్ తీసుకుంది.


Also Read: డార్లింగ్ సినిమా రివ్యూ: ప్రియదర్శిని చితక్కొట్టిన నభా నటేష్ - అపరిచితురాలు ఎలా ఉందంటే?






థియేటర్లలో 'డార్లింగ్'కు మిశ్రమ స్పందన!
Darling 2024 Movie Review: 'డార్లింగ్' సినిమాకు హైదరాబాద్ సిటీ, అమెరికాలో పడిన ప్రీమియర్ షోల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కామెడీ బావుందని పేరు వచ్చినప్పటికీ... ఓవరాల్ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. మురళీధర్ గౌడ్, అనన్యా నాగళ్ల కీలక పాత్రల్లో నటించారు.


Also Read: బహిష్కరణ రివ్యూ: Zee5 OTTలో లేటెస్ట్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ - అంజలి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?



పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'హనుమాన్' తర్వాత ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద కె నిరంజన్ రెడ్డి, ఆయన సతీమణి చైతన్య రెడ్డి నిర్మించిన సినిమా 'డార్లింగ్'. దాంతో బ్యానర్ గుడ్ విల్ సైతం యాడ్ అయ్యింది. మిక్స్డ్ టాక్ వల్ల సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.


Also Read: భక్తులకు పూనకాలు తెప్పించేలా 'రం రం ఈశ్వరం'... 'శివం భజే'లో తొలి పాట విన్నారా?