Top Telugu Headlines Today | అపోహల రాజకీయాల మధ్య తెలుగు రాష్ట్రాల సీఎం చర్చలు  - ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అందరి కళ్లూ చంద్రబాబు – రేవంత్ మీటింగ్ మీద ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవ్వడం ఇదే మొదటి సారి కాదు కానీ.. చాలా కాలం తర్వాత.. జరుగుతున్న ఈ  మీటింగ్ అవుట్ కమ్ ఏంటన్న దానిపై మాత్రం కొంత ఆసక్తి ఉంది. పదేళ్లుగా పరిష్కారం కాని సమస్యలు ఇప్పడవుతాయా.. వీళ్లు పాజిటివ్ గా ఆలోచించినా.. రేపు వచ్చే ప్రాక్టికల్ సమస్యలను పరిష్కరించడం ఇంత ఈజీనా అని ఇలా రకరకాల అభిప్రాయాలున్నాయి. అవి అలా ఉంచితే చంద్రబాబు- రేవంత్ రెడ్డి మధ్య ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా కూడా ఈ మీటింగ్ కు కాస్త ప్రాధాన్యం ఎక్కువే ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


GHMC కౌన్సిల్ సమావేశం రసాభాస - మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ కార్పొరేటర్ల డిమాండ్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) తొమ్మిదో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) కార్పొరేటర్లు సమావేశం ప్రారంభానికి ముందే ప్రధాన కార్యాలయం ఆవరణలో ఆందోళనకు దిగారు. అనంతరం శనివారం ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కాగా.. నిరసనలతో కొద్ది నిమిషాల్లోనే మీటింగ్ గందగోళంగా మారింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఆమె పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని.. మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


'మా అమ్మ చావుకు ఆ ముగ్గురే కారణం' - కొడాలి నాని, కలెక్టర్, బేవరేజెస్ మాజీ ఎండీపై పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి (Kodali Nani) మరోసారి షాక్ తగిలింది. 'తన తల్లి చావుకు వారే కారణం' గుడివాడ (Gudivada) ఆటోనగర్‌కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ (Duggirala Prabhakar) అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నానితో పాటు కృష్ణా జిల్లా గత జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతారెడ్డి, ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్- అమరావతి నిర్మాణంలో మరో కీలక పరిణామం
ఏపీ సీఎం చంద్రబాబు(Chandra Babu) తొలి ఢిల్లీ పర్యటనలోనే పలు కీలక ప్రాజెక్ట్‌లకు ఆమోదం లభించింది. అమరావతి(Amaravati) నిర్మాణమే ప్రథమ లక్ష్యంమని తెలిసిన చంద్రబాబు...అందుకు తగ్గట్లుగానే రాజధాని అభివృద్ధికి అవసరమైన పలు కీలక ప్రాజెక్ట్‌లకు కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకున్నారు. రాజధానికి గుండెకాయలాంటి ఔటర్‌రింగ్‌రోడ్డు(Outer Ring Road) నిర్మాణంతోపాటు, అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే పొడిగింపు, హైదరాబాద్‌- అమరావతి మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం.. విజయవాడ తూర్పు బైపాస్‌రోడ్డు నిర్మాణానికి కేంద్రం అంగీకారం తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


పిన్నెల్లికి పూర్తి స్థాయిలో జగన్ సపోర్ట్ - ఓటమికి కారణాలు గుర్తించడానికి జగన్ సిద్ధంగా లేరా ?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు మూడు హత్యాయత్నం కేసుల్లో నిందితునిగా ఉన్న పార్టీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు . ఈ సందర్భంగా ఆయన చేసిన వాదన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరోసారి సంచలనం అయింది. పిన్నెల్లికి ఓట్లు పడితే ఎందుకు ఈవీఎం ధ్వంసం చేస్తారని ఆయన ప్రశ్నించారు. అంతే కాదు.. కోర్టు తీర్పునకూ వక్రభాష్యాలు చెప్పారు. ఈవీఎం ధ్వంసం చేయడం కరెక్టేనని బెయిల్ ఇవ్వడం ద్వారా కోర్టు చెప్పిందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి