ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి టాప్ హెడ్ లైన్స్ 


సింపుల్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ ఉండాలి- అందరి పనితీరుపై మూడు నెలలకోసారి రివ్యూ: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జిల్లా యంత్రాంగంతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. గతంలో చాలా సార్లు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేశాం కానీ ఇది చాలా ప్రత్యేకమన్నారు సీఎం. ఈ భేటీ చరిత్రనే తిరగరాసేది అవుతుందని అన్నారు. ఐదేళ్ల పాటు పూర్తిగా విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అందరూ ఎక్కువ శ్రమించాల్సి వస్తోందని సూచించారు. అందుకే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకోవాలని అన్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


'తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు' - పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ (BRS) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సహా సీనియర్ నాయకుల బృందం సోమవారం చర్చలు జరిపింది. అటు రాజ్యాంగ నిపుణులతోనూ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమై చర్చించింది. పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్‌కు సంబంధించి ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు బీఆర్ఎస్ బృందానికి తెలిపారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అభ్యర్థన తిరస్కరించిన అంబటి రాయుడు- ఎలాంటి సాయం వద్దని స్పష్టం
అంబటి రాయుడు(Ambati Rayudu) రాజకీయాలను వదిలిపెట్టినా రాజకీయాలు మాత్రం అంబటి రాయుడిని వదిలిపెట్టేలా లేవు. ఇటీవల కాలంలో క్రికెట్‌ కన్నా రాజకీయం ద్వారానే వార్తల్లో నిలిచిన అంబటి...ఏపీ ఎన్నికలు ముగియడంతో ఇక ఆ పేరు ఎక్కడా వినిపించలేదు. కానీ ఉన్నట్టుండి తెలంగాణ రాజకీయ నేతల నోటివెంట ఆయన పేరు పలకడంతో అంబటి మళ్లీ స్పందించక తప్పలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఒకప్పుడు ఏపీ పాలన ఇతరులకు పాఠం- గత ఐదేళ్ల పాలన గుణపాఠం: కలెక్టర్ల సమావేశంలో పవన్ కామెంట్స్
పాలన ఎలా ఉండాలో గతంలో ఏపీ పాఠాలు నేర్పేది... అసలు పాలన ఎలా ఉండకూడదో గుణపాఠాలు నేర్పింది గత ఐదేళ్ల పాలన అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆయన ప్రభుత్వం ఆలోచనలను అధికారులకు వివరించారు. ఐదేళ్లుగా చాలా అవమానాలు భరించి అనేక ఒత్తిళ్లు తట్టుకొని అధికారంలోకి వచ్చామన్నారు. ప్రజాసేవలపై  ఎంతో కమిట్‌మెంట్ ఉన్నందునే అన్నీ దిగమింగి ఎన్నో అడ్డంకులు దాటుకొని ఎన్నికల్లో విజయం సాధించామని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఎత్తిన అధికారులు - వడివడిగా కృష్ణమ్మ పరుగులు
ఎగువన భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) డ్యామ్‌కు భారీగా వరద పోటెత్తిన క్రమంలో అధికారులు సోమవారం 6 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అంతకుముందు ఎస్ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. తొలుత దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు మూడుసార్లు సైరెన్ మోగించారు. అనంతరం ఒక్కో గేటును ఎత్తి ఆరు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఒక్కో గేటు నుంచి దాదాపు 5 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి