Simbaa Director Murali Manohar Reddy Gets Emotional: డైరెక్టర్‌ సంపత్‌ నంది నిర్మాణంలో ఆయన శిష్యుడు ముర‌ళీ మనోహార్‌ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 'సింబా: ది ఫారెస్ట్‌ మ్యాన్‌'. ఆరణ్యం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, అనసూయ భరద్వాజ్‌, శ్రీనాథ్‌, కస్తూరి, కబీర్‌ సింగ్‌, దివి పలువురు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చెట్లు, అడవులు ప్రాముఖ్యతను తెలుపుతూ ఓ మెసేజ్‌ ఒరియంటెడ్‌ ఈ చిత్రం తెరకెక్కుతోంది. వృక్షో రక్షిత రక్షితః అనే మెసేజ్‌తో ఆగష్టు 9న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.


ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది మూవీ టీం. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మొరళీ మనోహర్‌ మాట్లాడుతూ స్టేజ్‌పైనే ఎమోషనల్‌ అయ్యాడు. ఈ తన సినీ ప్రయాణంలో తన కుటుంబం తనకు అందించిన సహకారాన్ని గుర్తుంచేసుకొని కన్నీరు పెట్టుకున్నాడు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత తాను ఇప్పుడు డైరెక్టర్‌గా పరిచయం కాబోతుండటం ఆనందంగా ఉందని, ఈ సినిమా తనకు చాలా స్పెషల్‌ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.  "ఆర్టిస్టులతో సినిమా షూట్‌ చేయడం ఈజీనే.. కానీ ఇలా స్టేజీపైకి వచ్చి మాట్లాడటమే చాలా కష్టం. డైరెక్టర్‌ సంపత్‌ నందిగారు అందించిన కథ చాలా నచ్చింది.


అందుకే నేనే డైరెక్ట్‌ చేస్తానని చెప్పాను. తన విజన్‌కు న్యాయం చేశాననే అనుకుంటున్నాను. ఈ నా జర్నీ అంత ఈజీగా ఏం సాగలేదు. నా కుటుంబసభ్యుల సపోర్ట్‌ వల్లే ఇక్కడిదాకా వచ్చాను. ముఖ్యంగా నా భార్య నా జీవితానికి పిల్లర్‌లా నిలబడింది" అంటూ ఆయన కంటతడి పెట్టుకున్నాడు. అనంతరం నటుడు శ్రీనాథ్‌ మాట్లాడుతూ.. ఆడియన్స్‌కి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించాడు. మొక్కలు నాటి తనకు మెసెజ్ చేస్తే సినిమా టికెట్లు ఫ్రీగా ఇస్తాననిపేర్కొన్నాడు.  త్వరలోనే ఈ మొక్కలు నాటి టికెట్స్ ఎలా పొందాలి అని మూవీ యూనిట్ ప్రకటించనున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా సంపత్‌నంది టీమ్‌ వర్క్స్, రాజ్‌ దాసరి ప్రొడక్షన్స్ పై సంపత్‌ నంది, రాజేందర్‌ రెడ్డి కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 



ఇదిలా ఉంటే డైరెక్టర్‌ మురళీ మనోహర్ లండన్ ఫిలిం స్కూల్లో డైరెక్షన్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. అంతేకాదు అక్కడే రెండు ఇండీ సినిమాలకు పనిచేసి అనంతరం ఇండియాకు వచ్చాడు. ఇక్కడ పలు షార్ట్ ఫిలింస్‌ తీసిన మురళీ మనోహర్ సంపత్ నంది వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాడు. 'ఏమైంది ఈ వేళ' నుంచి దాదాపు ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు ఆయన దర్శకత్వ శాఖలో పనిచేశాడు. అదే విధంగా సంపత్ నంది నిర్మాణ సంస్థలో అదనపు బాధ్యతలు కూడా చూసుకున్న ఆయన ఇప్పుడు డైరెక్టర్‌గా పరిచయం కాబోతోన్నాడు.  ఈ నేపథ్యంలోనే ఆయన స్టేజ్‌పై మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యాడు.


Also Read: రితేష్‌తో జెనీలియా ప్రేమ ఎలా మొదలైందో తెలుసా? - అచ్చం తమ తొలి మూవీ స్టోరీనే.. వీరి ప్రేమకథ..!