కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'థగ్ లైఫ్' (Thug Life). ఇందులో శింబు మరో హీరో. త్రిష, అభిరామి, సాన్యా మల్హోత్రా హీరోయిన్లు. తాజాగా సినిమా ట్రైలర్ విడుదల చేశారు. అందులో కథ ఏమిటనేది దాదాపుగా క్లారిటీ ఇచ్చేశారు. 

Continues below advertisement


కొడుకు లాంటోడు ఎదురు తిరిగితే!?
'థగ్ లైఫ్' సినిమాలో కమల్ హాసన్ ఒక మాఫియా డాన్ టైప్ రోల్ చేస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఒకసారి తన ప్రాణాలు కాపాడిన అబ్బాయిని కన్న కొడుకు లాగా పెంచుతాడు. ఆ రోల్ శింబు చేశారు. మాఫియా సామ్రాజ్యాంలో శింబుకి ఇంపార్టెన్స్ ఇస్తారు కమల్. కానీ పరిస్థితులు అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా... కన్న కొడుకు లాంటోడు ఎదురు తిరుగుతాడు. ఏకంగా ప్రాణాలు తీయడానికి చూస్తాడు. అప్పుడు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


'థగ్ లైఫ్' ట్రైలర్ చూస్తే... క్యారెక్టర్లతో పాటు క్యారెక్టర్ల మధ్య రిలేషన్ ఏమిటి? అనేది కూడా దర్శకుడు మణిరత్నం రివీల్ చేశారు. కమల్ హాసన్ వైఫ్ రోల్ అమ్ము అభిరామి చేస్తే... ఆయనకు ప్రియురాలిగా త్రిష కనిపించారు. ఒక విధంగా ట్రైలర్ రిలీజ్ తర్వాత త్రిష క్యారెక్టర్ అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే...


సినిమాలో ఎక్కువ వయసున్న మగాడి పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఏజ్డ్ అని లుక్ చూస్తే అర్థం అవుతుంది.‌ యంగ్ విమెన్ రోల్ చేస్తున్న త్రిషతో రొమాంటిక్ సీన్ షాక్ ఇచ్చింది. అభిరామి, కమల్ మధ్య లిప్ లాక్ సీన్ కూడా ఉందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాజర్ చేశారు.


Also Read: మిస్టిక్ థ్రిల్లర్ 'వృష కర్మ'లో హీరో నాగ చైతన్య రోల్ తెలుసా... హీరోయిన్ మీనాక్షి చౌదరి రోల్ ఏమిటంటే?



కమల్ హాసన్, శింబు మధ్య యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలైట్ కానున్నాయని ట్రైలర్ చూసి చెప్పవచ్చు. ఇద్దరు ఎక్స్ట్రార్డినరీ యాక్టర్స్ మధ్య ఫైట్ సీన్ గూస్ బంప్స్ ఇచ్చేలా తీశారు. ట్రైలర్‌కు మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. అదే విధంగా కెమెరా వర్క్ కూడా బావుంది. జూన్ 5వ తేదీన తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ పతాకం మీద డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.


Also Readఅలేఖ్య చిట్టి చెల్లెలు రమ్య మోక్ష టిక్ టాక్ వీడియోస్ మామూలుగా లేవుగా... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ 10 పోస్ట్స్ చూడండి