'తండేల్'తో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. బాక్సాఫీస్ బరిలో ఆ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. 'తండేల్' సక్సెస్ తర్వాత 'విరూపాక్ష' వంటి హీట్ తీసిన కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఆయన సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాంట్లో హీరో హీరోయిన్ల క్యారెక్టర్లతో పాటు టైటిల్ గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. 


హీరో ట్రెజర్ హంటర్...
హీరోయిన్ ఆర్కియాలజిస్ట్!
Naga Chaitanya and Meenakshi Chaudhary's Vrusha Karma Updates: అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి 'వృష కర్మ' టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. హీరోగా నాగచైతన్య 24వ సినిమా కాబట్టి NC24 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇదొక మిస్టిక్ థ్రిల్లర్. ఈ జానర్ సినిమా చేయడం నాగ చైతన్యకు కొత్త.


Naga Chaitanya's Role In Vrusha Karma: 'వృష కర్మ' సినిమాలో నాగచై తన్యకు జోడీగా యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. సినిమాలో హీరో ట్రెజర్ హంటర్ రోల్ చేస్తుంటే... హీరోయిన్ అర్కియాలజిస్ట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారని సమాచారం. హీరో హీరోయిన్ల మీద తాజాగా ఫోటో షూట్ చేశారు.


Also Read: అలేఖ్య చిట్టి చెల్లెలు రమ్య మోక్ష టిక్ టాక్ వీడియోస్ మామూలుగా లేవుగా... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ 10 పోస్ట్స్ చూడండి


'వృష కర్మ' సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో స్పెషల్ సెట్ వేశారు. కళా దర్శకుడు శ్రీ నాగేంద్ర తంగల కొండలు, గుహలతో అద్భుతమైన సెట్ వేశారు. సుమారు 20 నిమిషాలకు పైగా సన్నివేశాలు అందులో జరుగుతాయని దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెలిపారు.


Also Read: ఈ ఎనిమిదేళ్ల అమ్మాయే ఆహా ఓటీటీలోని డాన్స్ ఐకాన్ 2 విన్నర్... ఆ చిన్నారి పేరు, ఆమెకు వచ్చిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?



సినిమా రైట్స్ తీసుకున్న నాగవంశీ?
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 'వృష కర్మ' సినిమా థియేట్రికల్ రైట్స్ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ సూర్యదేవర తీసుకున్నట్లు ఫిలింనగర్ టాక్. సుమారు 30 నుంచి 35 కోట్ల రూపాయల మధ్యలో ఈ డీల్ జరిగిందట. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.