Dance IKON Season 2 Winner: డాన్స్ ఐకాన్ 2 విన్నర్ ఎనిమిదేళ్ల అమ్మాయి... ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Eight year old Binita Chetry wins Dance IKON 2 trophy: బినీతా ఛెత్రి... ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే డాన్స్ రియాలిటీ షో 'డాన్స్ ఐకాన్' రెండో సీజన్ విన్నర్. ఇటీవల జరిగిన ఫినాలేలో ఆ చిన్నారి విజేతగా నిలిచింది.
'డాన్స్ ఐకాన్' రెండో సీజన్ ఫినాలేకు సుప్రీం స్టార్ సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా బినీత ట్రోఫీ అందుకున్నారు. ఆ చిన్నారికి ఆహా ఓటీటీ ఐదు లక్షల రూపాయలను ప్రైజ్ మనీగా ఇవ్వగా... అశ్విన్ బాబు 'వచ్చినవాడు గౌతమ్' టీం మరో ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ సైతం ఈ ఫినాలేలో సందడి చేశారు.
'డాన్స్ ఐకాన్' షోకి ఓంకార్ హోస్ట్. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, 'జాతి రత్నాలు' హీరోయిన్ ఫరియా అబ్దుల్లా జడ్జీలుగా చేశారు.
'డాన్స్ ఐకాన్ సీజన్ 2'లోని కంటెస్టెంట్లు అందరిలో చిన్నది బినీతా ఛెత్రి. యష్ మాస్టర్ మెంటార్షిప్‌లో అమ్మాయి షోను పాల్గొంది. ప్రతివారం తన పర్ఫామెన్స్ మెరుగు పరుచుకుంటూ అందరి ఫేవరెట్ కంటెస్టెంట్ అయ్యింది. చివరకు విజేతగా నిలిచింది.
డాన్స్ ఐకాన్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే విన్నర్ ఫోటోలు.