Sajjanar: పట్టు తప్పితే ప్రాణాలకే ప్రమాదం - ఫొటోస్ షేర్ చేసి పోస్ట్ పెట్టిన సజ్జనార్!
ట్రాఫిక్ పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా కొందరు వాహనదారులు మారడం లేదు.. ప్రమాదకరం అని తెలిసినా ప్రజలు వెనుకాడడం లేదు
నగరంలో ఏదో ప్రాంతంలో వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్
లేటెస్ట్ గా ఎక్స్ వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసిన సజ్జనార్.. ప్రమాదం అని తెలిసినా కొందరు ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నారని పోస్ట్ పెట్టారు
సమయం ఆదా చేయాలనో, త్వరగా గమ్యస్థానం చేరుకోవాలనే ఇలా చేస్తారు కానీ అనుకోని ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీ సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వండి అని పోస్ట్ పెట్టారు
ఆ మధ్య ఓ యువకుడు రైలుపట్టాలపై ఫీట్ చేసిన వీడియోను పోస్ట్ చేసి..సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం ఇలా ప్రాణాలను పణంగా పెట్టాలా అని క్వశ్చన్ చేశారు
బస్ కండక్టర్ తో ఓ యువకుడు ప్రాంక్ చేసిన వీడియో పోస్ట్ చేసి ఇలాంటి పనులు చేస్తే తాటతీస్తామని హెచ్చరించారు