Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode  సహస్ర లక్ష్మీ ఎదురుగానే విహారిని చేసుకొని తన ప్రేమని గెలిపించి పెళ్లి చేసుకున్నందుకు థ్యాంక్యూ అని చెప్తుంది. లక్ష్మీ వచ్చి అక్కడే నిల్చొంటే నీకు ఏం పనే ఇక్కడ అని సహస్ర తిడుతుంది. కొత్తగా పెళ్లి అయిన వాళ్ల దగ్గర ఉండకూడదు అని ఇంకిత జ్ఞానం కూడా లేదని తిడుతుంది.  

Continues below advertisement


లక్ష్మీ వ్రతం ఏర్పాట్లకు వెళ్తుంది. యమున లక్ష్మీకి పనులు పురమాయిస్తుంది. లక్ష్మీని చూసి అందరూ తనే కోడలు అనుకుంటారు. పంతులు లక్ష్మీని కూర్చొమని చెప్తారు. నేనా అని లక్ష్మీ షాక్ అయిపోతుంది. అక్కడున్న ఇద్దరు ఆడవాళ్లు లక్ష్మీని పీటల మీద కూర్చొపెడతారు. లక్ష్మీ కూర్చొంటుంది. అందరూ వచ్చి చూసి షాక్ అయిపోతారు. నువ్వేంటే అక్కడ కూర్చొన్నావ్ అని పద్మాక్షి, యమునలు అడుతారు. తను మీ కోడలు కాదా అని అడుగుతారు. తను మీ ఇంటి కోడలు ఏమో అనుకున్నాం అని పంతులు, అక్కడున్న వారు చెప్తారు. ఇంటి పని మనిషికి కోడలికి తేడా కనిపించడం లేదా అని తిడతారు. అసలు మిమల్ని ఈ కాలనీలో చూడలేదు అని కాదాంబరి అడిగితే గుడిలో పరిచయం అవడంతో పిలిచాను అని  యమున అంటుంది.


లక్ష్మీ ఇంత గ్రాండ్‌గా ఎందుకు రెడీ అయ్యావే అని తిడతారు. నేనే సహస్ర, విహారిల పెళ్లి కానుకగా ఇచ్చానని అంటుంది. అందరూ లక్ష్మీని బయటకు వెళ్లిపోమని అంటారు. సహస్ర, విహారిలు పీటల మీద కూర్చొంటారు. విహారిని చూసి ఎంత ఫీలవుతున్నావ్ బావ అని సహస్ర అనుకుంటుంది. మరోవైపు అంబికకు సుభాష్‌ కాల్ చేస్తే ఎందుకు దాన్ని వదిలేశావ్ లక్ష్మీ, విహారి ఇద్దరినీ ఎందుకు వదిలేశావ్ అంటుంది. సుభాష్ అర్జెంటుగా పది లక్షలు అడుగుతాడు. లక్ష్మీ చనిపోయింటే తనకే అకౌంట్ పగ్గాలు వచ్చేవని ఇప్పుడు లక్ష కావాలి అన్నా విహారిని అడగాలి లక్ష్మీకి లెక్క చెప్పాలని అంటుంది. లక్ష్మీని వీలైనంత త్వరగా చంపేయాలి అనుకుంటారు.


వ్రతం ప్రారంభమవుతుంది. సహస్ర స్వామి వారి కుంకుమ మంగళసూత్రానికి పెడుతుంది. అప్పుడు సహస్ర మెడలో మామూలు నగ చూసిన కాదాంబరి తర తరాలుగా వస్తున్న నగ వేసుకోలేదు ఏంటే అని అడుగుతుంది. ఇదే నువ్వు ఇచ్చిందని అంటుంది. అది అంత విలువైనదని ఈ ఇంటి కోడలు వ్రతం చేసుకునేటప్పుడు కచ్చితంగా వేసుకోవాల్సినది అని అంటుంది. అందరూ ఎక్కడ ఉందా అని వెతుకుతారు. మొత్తం వెతికినా ఎక్కడా దొరకదు.  ఇంటి కోడలు మాత్రమే వేసుకోవాల్సిన హారమే అది అని కాదాంబరి అంటుంది. 


అంబిక లక్ష్మీని పిలిచి తన మెడలో చీర కొంగు చాటున ఉన్న హారం బయటకు తీస్తుంది. కాదాంబరికి చూపించి అమ్మా ఇదేనా హారం అని అడుగుతుంది. అందరూ షాక్ అయిపోతారు. ఇది దాని మెడలోకి ఎలా వచ్చిందని అడుగుతుంది. పద్మాక్షి లక్ష్మీని లాగిపెట్టి కొడుతుంది. లక్ష్మీ వెళ్లి సహస్ర మీద పడుతుంది. ఇద్దరి తాళిలు ముడిపడతాయి. సహస్ర చిరాకు పడుతుంది. లక్ష్మీ దొంగతనం చేసిందేమో అని అంబిక అంటుంది. లక్ష్మీని ఏమీ అనొద్దని విహారి అంటాడు. కాదాంబరి లక్ష్మీని నీకు ఆ హారం ఎలా వచ్చిందే అని అడిగితే యమునమ్మ గారు ఇచ్చిన బాక్స్‌లో ఇదే ఉందని అంటుంది. దానికి యమున నేను సహస్ర వేసుకున్న హారం ఇచ్చానని అంటుంది. ఏదో పొరపాటు జరిగిందని యమున అంటుంది. 


పద్మాక్షి లక్ష్మీ మెడలో హారం తెంపేసి నువ్వు ఈ ఇంట్లో ఉండటమే పెద్ద శని నా కూతురిని ప్రశాంతంగా వ్రతం చేసుకోనివ్వవా అని అడుగుతుంది. విహారికి హారం ఇచ్చి సహస్ర మెడలో వేయమని చెప్తుంది. విహారి ఆ హారం సహస్ర మెడలో వేస్తాడు. సహస్ర చాలా హ్యాపీగా ఫీలవుతుంది. లక్ష్మీ బయటకు వెళ్లిపోతుంది. వ్రతం సంతోషంగా పూర్తవుతుంది. సహస్ర అందరికీ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది. కార్యం కోసం ముహూర్తం చూడమని యమున చెప్తుంది. 


లక్ష్మీ బయటకు వెళ్లి ఏడుస్తుంటుంది. విహారి అక్కడికి వెళ్తాడు. లక్ష్మీకి సారీ చెప్తాడు. ఎవరో కావాలని ఆ బాక్స్ మార్చేశారు అని విహారి అంటాడు. అంబిక మార్చుంటుందని అంటాడు. నాదే పొరపాటు అయింటుందని లక్ష్మీ అంటుంది. మీరు నా గురించి ఆలోచించడం కంటే సహస్రమ్మ కోసం ఆలోచించండి.. సహస్రమ్మకు మీరు అంటే పంచ ప్రాణాలు.. తన కోసం ఆలోచించండి అంటుంది. తన తాళికి ఎలా విలువ ఇవ్వాలో అర్థం కావడం లేదు అని విహారి అంటే మీరు అలా అంటే సహస్రమ్మ తట్టుకోలేరు అని లక్ష్మీ అంటుంది. అదే నాభయం తనకు నేను అంటే ప్రాణం తనతో నా గతం చెప్పలేను అలా అని నా భవిష్యత్ పంచుకోలేను అని విహారి అంటాడు. మనం ఇలా కలవడం కూడా సహస్రమ్మ తట్టుకోలేదు మీరు ఇలా కలవొద్దు అని వెళ్లిపోమని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: రూపతో మిస్ బిహేవ్ చేసిన దీపక్.. బుడ్డోడితో సహా వాయించేసిన ఫ్యామిలీ!