మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi)కి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళంలో ఆయన చేసిన సినిమాలు తెలుగులోనూ డబ్బింగ్ అవుతాయి. అందుకని, ఆయన సినిమా వస్తుందంటే టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. ఆయన నటించిన తాజా సినిమా 'ఏస్' (Ace Movie).
విజయ్ సేతుపతి జోడీగా రుక్మిణి!
'ఏస్'లో విజయ్ సేతుపతి సరసన 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) కథానాయికగా నటించారు. అరుముగ కుమార్ తెరకెక్కించారు. దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించారు. 7 సీఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తెలుగు హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ సొంతం చేసుకుంది.
Also Read: 'థగ్ లైఫ్' ట్రైలర్ రివ్యూ... షాక్ ఇచ్చిన త్రిష రోల్ - కమల్ & శింబు రోల్స్ రివీల్ చేశారుగా
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున!
శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ సంస్థ మీద బి. శివ ప్రసాద్ 'ఏస్'ను ఏపీ, తెలంగాణ - రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. ఇంతకు ముందు బి. శివ ప్రసాద్ దర్శక - నిర్మాణంలో 'రా రాజా' సినిమా వచ్చింది. ఇప్పుడు 'ఏస్'ను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందించగా... సామ్ సీఎస్ నేపథ్య సంగీతం సమకూర్చారు.
Also Read: మిస్టిక్ థ్రిల్లర్ 'వృష కర్మ'లో హీరో నాగ చైతన్య రోల్ తెలుసా... హీరోయిన్ మీనాక్షి చౌదరి రోల్ ఏమిటంటే?