Vijay Deverakonda About Marriage And Rashmika: విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'కింగ్‌డమ్' మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, లైఫ్ పార్ట్‌నర్, మూవీస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
పెళ్లి గురించి ఆలోచన లేదు
ప్రస్తుతానికి జీవిత భాగస్వామి గురించి పెద్దగా ఆలోచన లేదని.. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని విజయ్ అన్నారు. ఈ సందర్భంగా రష్మిక గురించి మాట్లాడారు. 'రష్మిక చాలా మంచి వ్యక్తి. ఆమెతో ఇంకా ఎన్నో మూవీస్‌లో యాక్ట్ చేయాలని ఉంది.' అని అన్నారు. 'మీ జీవిత భాగస్వామికి కావాల్సిన లక్షణాలు రష్మికలో ఉన్నాయా?' అంటూ ఎదురైన ప్రశ్నకు.. 'మంచి మనసు ఉన్న అమ్మాయి ఎవరైనా పర్వాలేదు.' అంటూ ఆన్సర్ చెప్పారు.
Also Read: మా నాన్న సంతోషమే నాకు ముఖ్యం - 2 వేలకు పైగా థియేటర్లలో కన్నప్ప రిలీజ్ చేస్తామన్న మంచు విష్ణు
'లైగర్' ఎన్నో పాఠాలు నేర్పింది
'లైగర్' తర్వాత తాను ఎంతో మారానని విజయ్ అన్నారు. 'డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా అంటే నాకు ఎంతో ఇష్టం. పూరీ జగన్నాథ్ అంటే కూడా చాలా ఇష్టం. ఆయనతో ఎప్పటికైనా మూవీ చేయాలనుకునేవాడిని. 'లైగర్'తో ఆ కల నెరవేరింది. స్టోరీ విన్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. అయితే.. అనుకున్నంత రిజల్ట్ సాధించలేకపోయాం. మా కాంబోలో హిట్ రాలేదనే బాధ ఉంది. లైగర్ మూవీ నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఆ మూవీ తర్వాత నేను చాలా మారాను.
నాగ్ అశ్విన్, సందీప్ వంగా, తరుణ్ భాస్కర్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. వారి సక్సెస్‌ను నేను సెలబ్రేట్ చేసుకుంటాను. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన అన్నీ సినిమాల్లో నేను నటించా. నాకు ఫస్ట్ సక్సెస్ అందించిన డైరెక్టర్ ఆయనే. ఆయన ఎంతో మంచి వ్యక్తి. ఆయనతో వర్క్ చేయడానికి ఎప్పుడూ ముందుంటాను.' అని విజయ్ అన్నారు.
జులై 4న 'కింగ్‌డమ్'
విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్‌డమ్'. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో విజయ్ స్పై రోల్ చేస్తున్నారు. ఆయన సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన లుక్స్, టీజర్ మూవీపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ నెల 30న మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా.. దేశంలో ప్రస్తుత పరిస్థితుల ఈవెంట్స్, ప్రమోషన్స్ చేయడం కష్టమని మూవీ టీం భావిస్తోంది. దీంతో జులై 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మూవీ టీం తాజాగా వెల్లడించింది. ఆలస్యమైనా ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని తెలిపింది.