Genelia Birthday Special: హా..హా.. హాసిని అంటూ కుర్రకారు గుండెల్లో గూడుకట్టుకుంది హీరోయిన్ జెనీలియా. ఆమె ఇండస్ట్రీకి దూరమైన దాదాపు 12 ఏళ్లు అవుతుంది. కానీ ఇప్పిటికీ ప్రేక్షకుల్లో ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. బొమ్మరిల్లు ఆమె పోషించిన హాసిని పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచింది. ఈ సినిమాలో ఆమె చేసిన అల్లరి చేష్టలు, క్యూట్ క్యూట్ డైలాగ్స్‌తో ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. గర్ల్‌ఫ్రెండ్ అలా ఉండాలంటూ కుర్రాకరు ఇప్పటికి 'బొమ్మరిల్లు' హాసిని తలుచుకుంటూ ఉంటారు. అంతగా తన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది జెన్నీ.
ఇది మాత్రమే కాదు 'రెడీ' సినిమాలోనూ పూజాగా సీరియస్ రోల్లో మెప్పించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోయే ప్రత్యేకమైన పాత్రలు చేసింది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, రామ్, రామ్ చరణ్ వంటి స్టార్స్ నటించి అతితక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నేడు ఈ హాసిని పుట్టిన రోజు. ఆగష్టు 5న జెనీలియా బర్త్‌డే సందర్భంగా ఆమె పర్సనల్, ప్రొఫెషనల్ లైప్‌పై ఓ లుక్కేద్దాం.
బాయ్స్ తో పరిచయం.. సత్యంతో ఎంట్రీ
'అంతేనా.. వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ' హీరో సిద్దార్థ్ గుండెల్లో గంట కొట్టిన ఈ హాసిని.. ఇండస్ట్రీకీ దూరమైన దాదాపు 12 ఏళ్లపైనే అవుతుంది. కానీ ఇప్పటికే హా.. హా హాసిని ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఆగష్టు 5, 1987లో ముంబైకి చెందిన క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది జెనీలియా. తమిళ డబ్బింగ్ మూవీ 'బాయ్స్' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. కానీ నేరుగు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది మాత్రం సుమంత్ 'సత్యం' మూవీతోనే. నిజానికి బాలీవుడ్ 'తుజే మేరీ కసమ్' జన్నీ సినీరంగ ప్రవేశం చేసింది. రితేష్ దేశ్‌ముఖ్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
'తుజే మేరీ కసమ్' సినీరంగ ప్రవేశం
'నువ్వే కావాలి' సినిమాకు ఇది రీమేక్ జోడి కానీ, ఆమె సౌత్‌లోనే వరుస సినిమాలు చేసి ఇక్కడ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. కెరీర్ ఫుల్ స్వీంగ్‌లో ఉండగానే రితేశ్ దేశ్‌ముఖ్‌ని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుపెట్టింది. తమ తొలి సినిమాతో ప్రేమలో పడ్డ వీరు తొమ్మిదేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 2012 ఫిబ్రవరి 3న వీరిద్దరు వివాహ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులు. అయితే తన తొలి సినిమా షూటింగ్ టైంలో రితేష్ దేశ్‌ముఖ్‌కి దూరంగా ఉండేదాన్ని జెన్నీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
రితేశ్ తో పరిచయం ఇలా
తన ప్రేమ గురించి చెబుతూ.. రితేశ్ ఓ సీఎం కుమారుడు కావడంతో అతని స్వభావం కూడా రాజకీయ నాయకుల మాదిరిగానే ఉంటుందనుకునేదాన్నని, దాంతో సెట్‌లో రితేశ్‌తో మాట్లాడటానికి ఆసక్తి చూపించేదాన్ని కాదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కానీ తను అనుకున్న దానికి భిన్నంగా రితేశ్ సెట్‌లో అందరితో కలిసిపోయి, అల్లరిగా ఉండేవాడు. తనని అలా చూసి షాక్ అయ్యానని, ఇక ఆ తర్వాత తమ మధ్య మాటలు కలిశాయని తెలిపింది. అది కాస్తా స్నేహం మారింది. అయితే మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరిగింది. మూవీ షూటింగ్ పూర్తి కాగానే రితేశ్ ముంబై వెళ్లిపోయాడు.. తాను ఇక్కడే సినిమాలు చేసుకుంటూ బిజీగ ఉండేదాన్ని అని చెప్పింది.
డెబ్యూ మూవీతో రితేశ్ తో జోడీ
అప్పుడు రితేష్‌ని చాలా మిస్ అవుతున్నా ఫీలింగ్ వచ్చిందని చెప్పింది. కానీ, అలాంటి ఫీలింగ్ రితేష్‌కు ఉందో లేదో తెలియదు. అందుకే అతడితో మాట్లాడేందుకు సాహసించలేదు. కానీ రితేష్ ఒకసారి ఫోన్ చేసి తనని మిస్ అవుతున్నట్టు చెప్పాడని, అలా తాను కూడా తన ప్రేమని భయపెట్టానని అని తెలిపింది. అలా తొమ్మిదేళ్లు ఇద్దరు సీక్రెట్ రిలేషన్‌లో ఉన్నామని, మొదట తమ పెళ్లికి పెద్దలు నిరాకరించిన ఆ తర్వాత ఒప్పుకోవడంతో భార్యభర్తలం అయ్యామని పేర్కొంది. అలా తమ తొలి సినిమా 'తుజే మేరీ కసమ్' సినిమాలాగే దూరంగా అయ్యాక తమ ప్రేమ బయటపెడ్డిందంటూ జెన్సీ చెప్పుకొచ్చింది.