ఢిల్లీ లిక్కర్ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 20వ తేదీ వరకు పొడిగించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులో రిమాండ్ ముగియడంతో కవితను వర్చువల్ గా ఆన్ లైన్‌లోనే రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవిత దర్యాప్తు కొనసాగుతోందని, రిమాండ్ పొడిగించాలని ఈడీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. 8 వేల పేజీల సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తెనాలి వైసీపీ ఎమ్మెల్యేపై కేసు, చెంప చెళ్లుమనిపించిన ఘటనలో షాక్
తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై పోలీస్ కేసు నమోదైంది. పోలింగ్ రోజు బూత్ లోనే ఆయన ఓ ఓటరుపై దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితుడు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎమ్మెల్యే సహా మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. తనపై ఎమ్మెల్యే కాకుండా మరో ఆరుగురు దాడి చేశారని బాధితుడైన గొట్టిముక్కల సుధాకర్ తన ఫిర్యాదులో వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


అర్థరాత్రి వరకు 78 శాతం పోలింగ్ నమోదు- మరింత పెరిగే ఛాన్స్
పెరిగిన పోలింగ్ శాతం ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతోంది. తమదే విజయం అంటూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఈవీఎంలలో నిక్షిప్తమైన రహస్యాన్ని ఛేదించే పనిలో ఉన్నారు. నియోజకవర్గాలు, మండలాలు, పంచాయతీలు వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఇంకా ఫైనల్ పోలింగ్ శాతాలు తేలకపోవడం కూడా నేతలను కంగారు పెట్టిస్తోంది. పోలింగ్ రోజు మార్నింగ్‌ ఓటరు ఉత్సాహం చూసిన వారంతా ఎవరికి నచ్చినట్టు వాళ్లు లెక్కలు వేసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం - రెండంకెల స్కోర్ సాధిస్తామన్న పార్టీలు
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌లో హైడ్రామా కనిపిస్తే తెలంగాణలో మాత్రం సైలెంట్‌గా ఓటింగ్‌గా ఓటింగ్ జరిగిపోయింది. కొన్నిచోట్ల బీజేపీ అభ్యర్థుల హడావుడి తప్ప అంతా ప్రశాంతంగా సాగింది. ఆరు నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలు ఈసారి ఏం వస్తాంలే అన్నట్టు కాకుండా భారీగా తరలి వచ్చి ఓట్లు వేశారు. రాత్రి 11 గంటల వరకు  అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 64.74 శాతం తెలంగాణలో పోలింగ్ నమోదు అయింది. పూర్తి లెక్కలు మంగళవారం సాయంత్రానికి అందిస్తామంటున్నారు అధికారులు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


నాగబాబు టార్గెట్ ఎవరు? పరాయివాడు అన్నది మేనల్లుడు బన్నీనా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, అలాగే రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఈ సోమవారం (మే 13న) ఎన్నికలు పూర్తి అయ్యాయి. అధికారంలోకి వైసీపీ పార్టీ తామే మరోసారి పగ్గాలు చేపడతామని ధీమాగా ఉంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు చెందిన కూటమి తాము అధికారంలో రావడం ఖాయమని, ఏపీ ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకు అనుగుణంగా తమకు ఓటు వేశారని బలంగా చెబుతున్నారు. ఎవరు అధికారంలోకి వస్తారు? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి