Seethe Ramudi Katnam Today Episode : సుమతి ట్రీట్‌మెంట్‌కు సహకరిస్తుందని వెంటనే సర్జరీ చేయాలని డాక్టర్ అనుకొని రామ్‌కి చెప్పాలని కాల్ చేస్తుంది. రామ్ ఫోన్ మహాలక్ష్మి లిఫ్ట్ చేస్తుంది. ఆపరేషన్ గురించి మాట్లాడాలని అంటుంది. దీంతో మహాలక్ష్మి డబ్బు పే చేశాం కదా ఏ నిర్ణయం అయినా మీరే తీసుకోండని అంటుంది. 


మహాలక్ష్మి: ఈ సీత కావాలనే ఆమెకు సుమతి పేరు పెట్టింది. మాటిమాటికి ఆ పేరు నాకు వినిపించేలా చేస్తుంది. ఆవిడ కాపాడింది అంటే నమ్ముతుంది. నేను కాపాడాను అని అంటే నమ్మడం లేదు. అంటే సుమతి తప్ప రామ్‌ని ఇంకెవరూ కాపాడలేరు అనుకుంటుందా. అయినా తనని తాను కాపాడుకోలేక సుమతి ఎప్పుడో చనిపోయింది. ఇప్పుడు తన కోసం ఎందుకు ఇంత ఆరాటం అనుకుంటుంది.


ఇక ఇంట్లో ప్రీతి, ఉష టీవీలో క్లాసికల్ సాంగ్ పెట్టుకొని భరతనాట్యం చేస్తుంటారు. మధు, గిరిధర్, జనార్థన్‌ చూస్తుంటారు. ఇంతలో సీత వచ్చి పొద్దున్నే ఏంటి ఈ వెధవ సంత, ఏంటి ఈ న్యూనెస్స్ అని అంటుంది. 


జనార్థన్: చక్కగా నాట్యం చేస్తున్న వాళ్లని ఇలా అనడం తప్పు సీత.


సీత: పైన మీ అబ్బాయి జ్వరంతో బాధపడుతున్నారు మావయ్య. ఇక్కడ నాట్యం పేరుతో ఇలా వీధి డ్యాన్సులు వేయడం ఏంటి.


మహాలక్ష్మి: వీధి డ్యాన్సులు వేయడం నీకు అలవాటు ఏమో సీత. వాళ్లకి కాదు. అయినా వీధి నాటకాలు ఆడే నీకు సంప్రదాయ నాట్యాలు ఏం తెలుస్తాయిలే. 


మధు: కరెక్ట్‌గా చెప్పారండి. ఇది ఊరిలో అలాంటి వేషాలే వేసేది. పిచ్చిగా తిరిగేది.


సీత: నేను ముఖానికే వేషం వేశానక్క. నువ్వు మాత్రం ఇప్పుడు నీ మనసుకు వేషం వేసి ఇక్కడ ఉంటున్నావ్.


మహాలక్ష్మి: మనసుకు ముసుగు వేసింది నువ్వు సీత. నువ్వేం చేసినా మధుకి సరితూగవు. 


సీత: నేను అమ్మవారి వేషం మాత్రం వేశాను. అదే అమ్మవారు నా ఒంట్లోకి వచ్చింది అంటే ఆపడం ఎవరి తరం కాదు. అని సీత టీవీ ఆపేస్తుంది. 


సీత టీవీ ఆపేసింది అని ఉష, ప్రీతిలు కంప్లైంట్ ఇస్తే మహాలక్ష్మి తాను టీవీ ఆన్ చేస్తా అంటుంది. టీవీ ఆన్ చేస్తుంది. సీత ఎందుకు ఆన్ చేశారని అంటే ఎవరు ఏమి చేసినా టీవీ ఆపనని మహాలక్ష్మి అంటుంది. 


సీత: మీ కొడుకుకి బాలేదు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా.


మహాలక్ష్మి: రామ్‌కి ఈ పరిస్థితి రావడానికి కారణమే నువ్వు. వాడిని ఇష్టం వచ్చినట్లు అన్ని అలాంటి హాస్పిటల్స్‌కి తిప్పి ఈ పరిస్థితి తీసుకొచ్చావు. 


సీత: మీరు ఏమైనా అనుకోండి టీవీ అయితే ఆపండి. మీ కొడుకు ఆరోగ్యం కంటే ఈ డ్యాన్స్‌లు ఎక్కువయ్యాయా.


మరోవైపు సుమతికి సర్జరీ మొదలు పెడతారు. ఇక రామ్‌ పడుకొని కలలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. తనని కన్న తల్లి గుర్తొచ్చిందని తనని కాపాడిన ఆవిడ కూడా గుర్తొచ్చిందని అంటాడు. సీత ధైర్యం చెప్తుంది. ఇక తన తల్లి గురించి సీతకు చెప్తాడు. తర్వాత సీత రామ్‌కి పాలు ఇస్తుంది. రామ్ పాలు తాగి పడుకుంటాడు. 


సుమతికి సర్జరీ అవుతుంటుంది. ఇక సీత, రామ్‌ ఇద్దరూ హాస్పిటల్‌కి వెళ్దామని అంటాడు.  సీత నీ ఆరోగ్యం బాలేదని తగ్గితే వెళ్దామని సీత అంటుంది. మరోవైపు డాక్టర్లు సుమతికి ఆపరేషన్ చేస్తారు. రామ్‌ వాళ్ల వైపు నుంచి రెస్పాన్స్ లేదని సుమతికే విషయం చెప్పి డిశ్చార్జి గురించి మాట్లాడుదామని అనుకుంటారు. ఇంతలో సీత, రామ్ హాస్పిటల్‌కి వస్తారు. వాళ్లు సుమతిని చూసి ఐదు రోజులు అయిందని ఆవిడని చూసి తనకు ఎవరూ లేకపోతే మనమే తన బాగోగులు చూసుకుందామని సీతతో రామ్ అంటాడు.


సీత, రామ్‌ సుమతి బెడ్ దగ్గరకు వచ్చినప్పటికీ సుమతి అక్కడ ఉండదు. రామ్ సీతలు డాక్టర్ దగ్గరకు వెళ్తారు. సుమతి గురించి అడిగితే ఈరోజే సుమతి వెళ్లిపోయిందని.. నాలుగు రోజుల క్రితం రామ్ నెంబరుకి కాల్ చేశామని లేడీ లిఫ్ట్ చేసి ఆపరేషన్ చేసేమని అన్నారని అంటుంది. ఇక సీత రామ్‌లు ఆవిడ వివరాలు అడిగితే తెలీదు అని అంటారు. సర్జరీ వల్ల తన రూపు రేఖలు మారిపోయాయని అంటుంది. 


సుమతి రూపం మార్చేశారు. జరిగిన ప్రమాదంలో సుమతి ముఖం పూర్తిగా మారిపోయిందని అందుకే కొత్త ముఖం వచ్చిందని అంటారు. దీంతో సుమతి తన ముఖం చూసుకొని నేను ఇకపై ఈ కొత్త ముఖంతోనే బతకాలని.. మహాలక్ష్మి అంతు తేల్చుతానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: వాట్ ఏ సీన్.. ఆదర్శ్‌ని చూసి ముకుంద ఇచ్చిన ఒక్క ఎక్స్‌ప్రెషన్‌కు కథంతా తారుమారు..!