Satyabhama Today Episode : నందినిని మహదేవయ్య ఇంటికి తీసుకొస్తారు. డాక్టర్ చూసి జ్వరమని రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకోవాలి అని చెప్తాడు. ఇక భైరవి బయటకు వచ్చి నందిని వీక్‌గా ఉంది జాగ్రత్తగా చూసుకోవాలని లేదంటే ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్ చెప్పారని అందరికీ చెప్తుంది.
సత్య: వేరే సమస్యలు అంటే..
భైరవి: భయం వేసి ఆ మాట నేను అడగలేదమ్మ. అంతే కాదు మెంటల్‌గా కూడా ఏదో పరేషాన్‌లో ఉందని అనిపిస్తుందట. ఒక్కదాన్నే ఒంటరిగా విడిచిపెట్టొద్దని చెప్పారు. ఇలాంటప్పుడే బిడ్డకు తల్లి ప్రేమ అవసరం అవుతుంది.
విశాలాక్షి: నందినికి మానసికంగా బాధ పడే అంత అవసరం ఏంటి.
భైరవి: అది నాకు ఎలా తెలుస్తుంది. కోడల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు అనుకున్నా. అక్కడేం జరుగుతుందో మాకేం తెలుసు సీసీ కెమెరాలు పెట్టామా ఏంటి.
హర్ష: కావాలి అంటే పెట్టుకోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు.
సత్య: అత్తయ్య నందినిని వేరే ఎవరైనా మంచి డాక్టర్‌కి చూపిద్దామా.
రుద్ర: నాయినా నీ కోడలికి మన ఇంటి మనుషుల మీదే కాదు మన ఫ్యామిలీ డాక్టర్ మీద అనుమానమే.
భైరవి: నాకు తెలీక అడుగుతా వదినే..దానికి బాలేనప్పుడు గుడికి ఎందుకు తీసుకొచ్చారు.
విశాలాక్షి: నందినికి జ్వరం అన్న విషయం మాకు తెలీదు వదినా. గుడిలో కూడా బాగానే ఉంది కదా.
హర్ష: ఎందుకో తను డల్‌గా ఉన్నట్లు అనిపించింది. అడిగాను కూడా పొగరుగా సమాధానం చెప్పింది.
మహదేవయ్య: ప్రేమగా చూసుకుంటే ఎవరూ పొగరుగా ఉండరు.
క్రిష్: పొగరుగా మాట్లాడింది అని పట్టించుకోకుండా ఉంటామా.
మహదేవయ్య: రేపు ప్రాణం మీదకు వచ్చినా ఇంతేనా.
సత్య: అసలు సమస్య ఏంటో నందినినే పిలిచి అడుగుదాం. అదిగో నందిని గుమ్మం దగ్గరే ఉంది.
భైరవి: మనసులో.. లోపల ఉండమంటే ఇది బయటకు ఎందుకు తగలబడింది.
విశ్వనాథం: అది కాదమ్మా నువ్వు మెంటల్‌గా ఏదో ఇబ్బంది పడుతున్నావంట. అందరి ముందు అడుగుతున్నా నీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పమ్మా.
భైరవి: మనసులో.. సచ్చింది గొర్రె.
నందిని: బాపు నన్ను ఏం అడగొద్దు. ఇక్కడ ఉన్న వాళ్లంతా మంచోళ్లే. నేనే చెడ్డదాన్ని. ఒక్కటి మాత్రం నిజం బాపు నీ మీద అమ్మ మీద దిగులు పెట్టుకున్నాను.
భైరవి: బిడ్డను కొన్ని దినాలు మన దగ్గరే ఉంచుకుందామయ్యా.
మహదేవయ్య: సరే కానీ రెండు దినాలు ఇక్కడే ఉంటుంది. అల్లుడు కూడా ఉంటాడు.
హర్ష: నాకు కుదరదు.
నందినిని ఇంటి దగ్గర వదిలేసి హర్ష వాళ్లు వెళ్లిపోతారు. మరోవైపు రుద్ర తన భార్య రేణుక దగ్గరకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు ట్యాబ్లెట్స్ వేసుకోమని ఇచ్చి తన దగ్గరకు రమ్మని అంటాడు. రేణుక పిల్లలు లేకుండా ఇలా ఎంత కాలమని మనసు మార్చుకోమని అంటుంది. దీంతో రుద్ర అవసరం అయితే పెళ్లాన్ని మార్చేస్తా కానీ పిల్లల విషయంలో మనసు మార్చుకోనని చెప్తాడు.
ఇక రేణుక దగ్గరకు సత్య వస్తుంది. సత్య రావడంతో ట్యాబ్లెట్స్ దాచేస్తుంది. ఇక సత్య ట్యాబ్లెట్స్ చూసి ఏంటవని అడిగితే రేణుక తలనొప్పి అంటే తన భర్త ఇచ్చాడని చెప్తుంది.
ఇక నందిని పుట్టింటికి వచ్చిన ఆనందంలో పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది. భైరవి కూతురు దగ్గరకు వచ్చి సంబరపడిపోతుంది. ఇక రెండు రోజులు కాకుండా జీవితాంతం ఇక్కడే ఉంచేస్తానని భైరవి అంటుంది.
నందిని: అమ్మా ఎందుకో కానీ మీ అల్లుడులో మార్పు కనిపిస్తుంది. చూపుల్లో ప్రేమ తొంగి చూస్తుంది. మాటల్లో దగ్గరవ్వాలి అన్న ఉత్సాహం కనిపిస్తుంది. అందుకే రెండు దినాల తర్వాత ఇంటికి వచ్చి తీసుకెళ్లిపోతా అంటాడేమో.
భైరవి: వస్తే రానీ నేను వెనక్కి పంపిస్తా కదా. నా కూతురు కావాలి అంటే ఈ ఇంట్లో ఇళ్లరికం ఉండమని అంటా. లేదు అంటే విడాకులు ఇచ్చేమంట. ఇక నువ్వు నా పక్కనే ఉన్నావు కాబట్టి ఆ సత్యని ఆడుకుంటా.
సత్య క్రిష్‌లు వేరు వేరు బెడ్‌ల మీద పడుకొని ఉంటారు. క్రిష్ సత్య వైపు తిరిగి పడుకొని ఉన్న సత్యని చూసి అలా చూస్తూ ఉండిపోతాడు. జీవితాలు విడదీశావ్, మంచాలు విడదీశావ్ కానీ అందాన్ని మాత్రం నా కళ్ల ముందే ఉంచావని అనుకుంటాడు. ఇంతలో సత్య లేచి చూసే సరికి క్రిష్ పడుకున్నట్లు నటిస్తాడు. ఏయ్ ఏం చూస్తున్నావ్ అని సత్య అరుస్తుంది. ఇక క్రిష్‌ని తిట్టి సత్య పడుకుంటుంది.
క్రిష్ సత్య పని చెప్పాలి అని ఫోన్ చూసి పక్కనే పెడతాడు. ఇక ఇంతలో రూమ్ డోర్ కొట్టడంతో ఎవరు అని అనుకుంటారు. ఇక సత్య క్రిష్‌ని మంచాలు దగ్గరకు వేయమని అంటుంది. క్రిష్ నో చెప్పడంతో సత్య బెడ్ దగ్గరకు సర్ది డోర్ తీస్తుంది. ఇంతలో ఎదురుగా పంకజం పాలు పట్టుకొని వస్తుంది. పంకజాన్ని సత్య వెళ్లిపోమంటే క్రిష్ పాలు తెమ్మని మెసేజ్ చేశాడని అంటుంది. దీంతో సత్య కోపంగా క్రిష్‌ని చూస్తుంది. ఇక పంకజం వెళ్లిపోయిన తర్వాత సత్య క్రిష్‌ని తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.