Breaking News Live Telugu Updates: కేసీఆర్‌ కోలుకోవడానికి నెలకుపైగా సమయం- హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

ABP Desam Last Updated: 08 Dec 2023 12:00 PM
కేసీఆర్‌ కోలుకోవడానికి నెలకుపైగా సమయం- హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు

బాత్‌రూమ్‌లో జారి పడిన కేసీఆర్‌ ఎడమ కాలి తుంటికి గాయమైనట్టు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేసిన వైద్యులు కేసీఆర్‌ కోలుకోవడానికి ఆరు నుంచి 8 వారాల సమయం పడుతుందని తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలు

జ్యోతీరావ్‌పూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజాదర్బారులో సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు వచ్చి కలుస్తున్నారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును సీఎం స్వయంగా పరిశీలిస్తున్నారు. వాటిని వివిధ శాఖలకు జిల్లా యంత్రాంగానికి సిఫార్సు చేస్తున్నారు. 

Background

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమావేశమయ్యారు. రేపటి(శనివారం) నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన విధి విధానాలు చర్చించేందుకు సీఎంతో సజ్జనార్ సమావేశం అయ్యారు. 


తెలంగాణలో కొలువుదీరిన ప్రభుత్వం తొలి కేబినెట్ భేటీలోనే ఉచిత ప్రయాణాలపై నిర్ణయం తీసుకుంది. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి రూల్స్ రెగ్యులేషన్స్‌ ఇవాళ ఖరారు కానున్నాయి. 


ఇప్పటికే దీనిపై స్టడీ చేసేందుకు అధికారుల బృందం కర్ణాటక వెళ్లింది. ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆర్టీసీపై పడుతున్న భారం, ప్రభుత్వం చేపట్టే చర్యలు, రూల్స్ అండ్‌ రెగ్యులేషన్స్‌ గురించి అధ్యయనం చేశారు. ఆ వివరాలను ఎండీ సజ్జనార్‌కు అందజేశారు. వాటి ఆధారంగా తెలంగాణ ఓ విధానాన్ని రూపొందించనున్నారు. 


ముఖ్యమంత్రితో చర్చల అనంతరం పూర్తిస్థాయి ప్రకటన వెలువడనుంది. అసలు ఏఏ మహిళలకు ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తారు. పరిధి ఏమైనా విధిస్తారా, ఏ గుర్తింపుకార్డులు చూపించాలి అన్నింటిపై క్లారిటీ రానుంది. 


కర్ణాటకలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినప్పుడు బస్సులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణలో అలాంటి పరిస్థితి ఉంటుందనే వాదన కూడా ఉంది. ఇప్పటికే తెలంగాణలో 40 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతున్నారు. వారికి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే ఆర్టీసీ సంస్థకు రావాల్సిన 4 కోట్ల ఆదాయం తగ్గపోనుంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.