Breaking News Live Telugu Updates: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలుగా కేటీఆర్, కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, మొన్న ప్రమాణం చేయని సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
Background
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగనుంది. ఉదయం పదిన్నరకు అసెంబ్లీ సమావేశాలు ప్రారభమవుతాయి. ఇప్పటి వరకు ప్రొటెం స్పీకర్‌గా ఉన్న అక్బరుద్దీన్.. స్పీకర్‌గా ఎన్నికైన ప్రసాద్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగిస్తారు. అనంతర ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి అధికార ప్రతిపక్ష నేతలంతా హాజరుకానున్నారు. ఆయన్ని అభినందించనున్నారు. ఆయన ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడతారు. స్పీకర్ ఎన్నికకు బీజేపీ ఎమ్మెల్యేలు మినహా మిగతా పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత సభను వాయిదా వేస్తారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై చర్చిస్తుంది. ఈ శీతాకాల సమావేశాలను సుమారు 10 రోజుల పాటు నిర్వహించాలని ప్రభత్వం భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో రేపు ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణ రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. శాసనసభ, మండలి ఒకేచోట ఉండేలా పార్లమెంట్ తరహా కలిపించేలా మార్పులు చేర్పులు చేయబోతోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి పూర్తిగా మార్చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం రేవంత్... పెండింగ్ పనులు పూర్తి చేయాలని సమస్యలు పరిష్కారించాలని అన్నారు.
నేడు బాధ్యతలు స్వీకరించనున్న మంత్రులు
ఇప్పటికే ప్రమాణం చేసిన మంత్రులు రోజువారి కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఇంతవరకు బాధ్యతలు తీసుకోలేదు. ఇవాళ పలువురు మంత్రులు బాధ్యతలు తీసుకోనున్నారు.
శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క 8 గంటలకు బాధ్యతలు తీసుకుంటారు. దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఉదయం 9 గంటలకు తన ఆఫీస్‌లో అడుగు పెడతారు.
తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
మరోవైపు మంచు గడ్డలా మారిపోయిన తెలుగు రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి తీవ్ర విపరీతంగా పెరిగింది. మరో మూడు నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. తర్వాత రెండుమూడు రోజులుగ్యాప్ ఇచ్చిన మళ్లీ చలి తీవ్రత పెరుగుతుందని అంటున్నారు. చలిగాలులు కూడా వీటికి జతకలిసే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల నుంచి 31 డిగ్రీల మధ్య ఉంటోంది. రాత్రి ఉష్ణోగ్రతలు మరింత దిగువకు పడిపోయాయి. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మెదక్, పటాన్‌చెరు, ఆదిలాబాద్, రామగుండంలో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు రిజిస్టర్ అవుతున్నాయి. నిజామాబాద్, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, భద్రాచలంలో 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -