గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెడుతూ 'గేమ్ ఛేంజర్' మూవీతో ఈ రోజు థియేటర్లలోకి వచ్చేశారు. జనవరి 10న 'గేమ్ ఛేంజర్' సినిమా ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీకి పాజిటివ్ టాక్ నడుస్తుండగా, సినిమా ఏ ఓటీటీలో, ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అనే చర్చ మొదలైంది.
'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్టనర్ ఫిక్స్....
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన పాన్ ఇండియా పొలిటికల్ డ్రామా 'గేమ్ ఛేంజర్'. విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. మూవీ రిలీజ్ కి ముందే టీజర్, ట్రైలర్, పాటల ద్వారా మంచి హైప్ పెరిగింది. ఇక తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ నడుస్తోంది. అయితే థియేటర్లో టైటిల్ కార్డ్ వేసిన టైంలో ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ ని రివీల్ చేశారు మేకర్స్. దాని ప్రకారం 'గేమ్ ఛేంజర్' మూవీ ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన ఆరు వారాల తర్వాత ఓటిటిలో రాబోతోందని టాక్ నడుస్తోంది.
భారీ ధరకు ఓటీటీ రైట్స్...
నిజానికి ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని రెండు డిజిటల్ ప్లాట్ఫామ్స్ దక్కించుకున్నాయని ప్రచారం జరిగింది. 'గేమ్ ఛేంజర్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో 100 కోట్లకు పైగానే వెచ్చించి, సౌత్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుందని వార్తలు వినిపించాయి. ఇక ఈ మూవీ హిందీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని మాత్రం మరో ఓటీటీ దక్కించుకుందని, మొత్తంగా ఓటీటీ డీల్ ద్వారానే 'గేమ్ ఛేంజర్' మూవీకి 150 కోట్ల బిజినెస్ జరిగిందని టాక్ వినిపించింది. కానీ తాజా సమాచారం ప్రకారం 'గేమ్ ఛేంజర్' డిజిటల్ పార్ట్నర్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఫిక్స్ అయింది.
Also Read: 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 222 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రంగంలోకి దిగింది. ఈ మూవీకి 220 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగ్గా, తెలుగు రాష్ట్రాల్లోనే 'గేమ్ ఛేంజర్' మూవీ థియేట్రికల్ బిజినెస్ రూ.122 కోట్ల వరకు జరిగినట్టు తెలుస్తోంది.
'గేమ్ ఛేంజర్' శాటిలైట్ రైట్స్
ఈ మూవీ థియేటర్ రన్ తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. ఆ తర్వాత 'గేమ్ ఛేంజర్' మూవీ టెలివిజన్ ప్రీమియర్ కూడా ఉంటుంది. ఈ మేరకు 'గేమ్ ఛేంజర్' మూవీ శాటిలైట్ రైట్స్ జీ తెలుగు, జీ సినిమాలు సొంతం చేసుకున్నాయని సమాచారం. అంటే మరి కొన్ని రోజుల్లో ఈ మూవీని జీ తెలుగు లేదా జీ సినిమాలు చానల్స్ లో చూడొచ్చు టెలివిజన్ మూవీ లవర్స్.