Breaking News Live: ఈ నెల 21న పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 16 Nov 2021 10:44 PM
ఈ నెల 21న పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఈ నెల 21న తేదీన జనసేన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొంటారు. 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో సభ మొదలవుతుంది. ఆ రోజే ప్రపంచ మత్స్య దినోత్సవం కావడంతో పవన్ కల్యాణ్ వేదికపై మత్స్యకారుల అభివృద్ధి మాట్లాడనున్నారు. పోరాట యాత్రకు గంగ పూజ చేసి శ్రీకారం చుట్టింది. నరసాపురంలోని బహిరంగ సమావేశం వేదిక నుంచి రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, జీవనోపాధికి విఘాతం కలిగించే వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తావిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా నెలకొన్న పలు కీలక సమస్యలను జిల్లా నాయకులు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకువచ్చారు. 

రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనం గురువారం నాటికి దక్షిణ కోస్తా - ఉత్తర తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో బుధవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం కూడా పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉంటుందన్నారు

మంత్రి మండలి సమావేశం వాయిదా

బుధవారం రోజున జరగాల్సిన ఏపీ మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.

బండి సంజయ్ కు సీఎం కేసీఆర్ సవాల్

బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులకు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. రైతులకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలన్నారు. రైతులపై బీజేపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. 

ఆర్టీసీ బస్సులో  ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... 

తెలంగాణ భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం సీతాయి గూడెం గ్రామానికి చెందిన ప్రేమ జంట ఆత్మహత్యయత్నం చేశారు. బస్ లో పురుగులు మందు తాగి ప్రయాణినస్తుండగా అశ్వారావుపేట బస్టాండ్ కు రాగానే పరిస్థితి విషమించింది. డ్రైవర్, కండక్టర్ వారిని గుర్తించి హాస్పటల్ కి తరలించారు. జగ్గారావు(28), మైనర్ గా గుర్తించారు. అశ్వారావుపేట హాస్పటల్ లో ఇరువురు చికిత్స పొందుతున్నారు. 

రేపు, ఎల్లుండి తిరుపతి నడక దారులు మూసివేత

ఈనెల 17, 18 తేదీల్లో నడక దారులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఈ రెండు రోజులు తిరుమలకు వెళ్లే రెండు నడక దారులు (అలిపిరి, శ్రీవారి మెట్టు) తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుమలకు వెళ్లే భక్తులు ఘాట్ రోడ్ లో ప్రయాణించాలని సూచించించింది. 

కాసేపట్లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం... కేసీఆర్ దీక్షపై చర్చ

టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ నెల 29న సీఎం కేసీఆర్ దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షపై సమావేశంలో చర్చించనున్నారు.  

బండి సంజయ్ పై కేసు... టీఆర్ఎస్ పై గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పర్యటనను టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం ఐకేపీ సెంటర్ కు బండి సంజయ్ రాకముందే టీఆర్ఎస్ నేతలు అక్కడకు చేరుతున్నారు. బీజేపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. బీజేపీ నాయకులకు చెందిన రెండు వాహనాల ధ్వంసం చేశారు. చివ్వేంల నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను దారి మధ్యలోనే ఆపి లక్ష్మీ నాయక్ తండా రైతులు తమ పొలాల్లోకి తీసుకెళ్లి తమ బాధలను తెలిపారు. రోజుల తరబడి ధాన్యం కొనాలని వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడుతుండగా వర్షం ప్రారంభం కావడంతో  వారితో కలిసి స్వయంగా ధాన్యంపై బండి సంజయ్ కుమార్ టార్పలిన్ కప్పారు.  సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) లో బండి సంజయ్ పర్యటన వద్దని రావొద్దంటూ మహిళ రైతుల నిరసన చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పై టీఆర్ఎస్ దాడి, పోలీసుల వ్యవహారశైలిపై బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతలు, రైతులకు ఇబ్బంది కలిగించారని బండి సంజయ్ పై కేసు నమోదైంది. 

తమిళిసైని కలిసిన బీజేపీ నేతలు

గవర్నర్ తమిళిసైతో బీజేపీ రాష్ట్ర బృందం మంగళవారం భేటీ అయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడి, పోలీసుల వ్యవహారశైలిపై బీజేపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వానాకాలం పంటను కొనకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందనే విషయాన్ని గవర్నర్ దృష్టికి బీజేపీ బృందం తీసుకెళ్లింది. ఈ భేటీలో ఈటల రాజేందర్, రఘనందన్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, డీకే అరుణ, లక్ష్మణ్, గరికపాటి, విజయరామారావు, పొంగులేటి తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు.. ఆ ఆరుగురు వీరే..

టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా..
1. బండా ప్రకాశ్‌, 
2. కడియం శ్రీహరి, 
3. తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, 
4. కౌశిక్‌ రెడ్డి, 
5. గుత్తా సుఖేందర్‌రెడ్డి, 
6. వెంకట్రామిరెడ్డి .
మరికాసేపట్లో వీరంతా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. బండా ప్రకాశ్ రాజ్యసభ సీటు మధుసూధనాచారికి దక్కనుంది. ముదిరాజ్ కోటాలో బండా ప్రకాశ్‌కు మంత్రిగా అవకాశం ఇవ్వనున్నారు.

నేడు సూర్యాపేటలో బండి సంజయ్ పర్యటన

నేడు సూర్యాపేట జిల్లాలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. ఆత్మకూర్ (ఎస్), జాజిరెడ్డి గూడెం, తిరుమలగిరి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను బండి సంజయ్ పరిశీలించనున్నారు. అనంతరం సూర్యాపేట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. నిన్న బండి సంజయ్‌పై రాళ్లు, టమాటాలతో దాడి జరిగిన సంగతి తెలిసిందే.జ

రైలు కింద పడి వ్యక్తి మృతి

జోగులాంబ గద్వేల్‌ జిల్లాలో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఒక యువకుడు మృతి చెందాడు. ధరూర్ మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహం ధరూర్ వైన్స్ సమీపంలో పడి ఉంది. దాన్ని చూసిన స్థానికులు.. మృతుడిని మన్నాపురం గ్రామానికి చెందిన బోయ తిమ్మప్ప (25) గా గుర్తించారు. బోయ తిమ్మప్పకు భార్య, ఒక కూతురు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.

వాగులో మునిగి బాలురు దుర్మరణం

సిరిసిల్ల జిల్లాలోని మానేర్ వాగులో మునిగి ముగ్గురు బాలురు దుర్మరణం చెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సిరిసిల్లలోని రాజీవ్ నగర్‌కి చెందిన కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. గల్లంతైన ఈ విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాత్రివేళల్లో సైతం కరీంనగర్ నుంచి రెస్క్యూ టీంతో కలిసి విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. డీఎస్పీ చంద్రశేఖర్, రూరల్ సీఐ ఉపేందర్, తహసీల్దార్ సదానందం, తంగళ్ళపల్లి ఎస్సై లక్ష్మారెడ్డి, సిబ్బంది అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు.

Background

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన ఉద్యమం 700వ రోజుకు చేరింది. మరోవైపు, ఏపీ హైకోర్టు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకూ రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర 16వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో వీరి పాదయాత్ర కొనసాగుతోంది. జిల్లాలోని విక్కిరాలపేట నుంచి కందుకూరు వరకు నేడు ఈ మహాపాదయాత్ర కొనసాగనుంది.


జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ప్రారంభం
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. మొత్తం రాష్ట్రంలో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన చోట్ల ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 954 కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలో మొత్తం జడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది బరిలో ఉన్నారు. ఏకంగా 8,07,640 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓట్లను ఈ నెల 18న లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.


స్థిరంగా ఇంధన ధరలు
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర రూ.0.19 పైసలు తగ్గింది. దీంతో తాజా ధర రూ.107.69 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.17 పైసలు తగ్గి రూ.94.14గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.


Also Read: బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత... కాన్వాయ్ పై రాళ్ల దాడి కారు అద్దాలు ధ్వంసం... బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య బాహాబాహీ 


పసిడి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు తగ్గింది. పసిడి ధర గ్రామునకు రూ.21 తగ్గగా.. వెండి ధర గ్రాముకు రూ.0.70 పైసలు తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,900 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.50,070 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.71,000గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. 


Also Read: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అశ్లీల నృత్యాలు... ఇవేం పనులంటూ స్థానికుల మండిపాటు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.