Telangana News Today - ఏపీలో యూట్యూబ్ అకాడెమీ - యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో చంద్రబాబు చర్చలు
ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్ అకాడెమీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు యూట్యూబ్ ను ఆహ్వానించారు. యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ APAC హెడ్ సంజయ్ గుప్తాలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు. లోకల్ పార్టనర్లతో కలిసి యూట్యూబ్ అకాడెమీ ఏర్పాటు చేయాలని ఆయన వారిని ఆహ్వానించారు. కంటెంట్, స్కిల్ డెలవప్‌మెంట్, ఏఐ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వంటి వాటిపై ప్రత్యేకంగా అకాడెమీలో పరిశోధనలు చేయవచ్చన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


స్థానిక విద్యార్థులకే ఎంబీబీఎస్ కన్వీనర్‌ కోటా సీట్లు, చిచ్చురేపుతున్న 'స్థానికత' వివాదం
తెలంగాణలోని వైద్య ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లలో జాతీయ కోటా మినహా మిగిలిన కన్వీనర్‌ కోటా సీట్లన్నీ స్థానిక విద్యార్థులకే దక్కనున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు 10 సంవత్సరాలపాటు అమలైన 15 శాతం అన్‌రిజర్వ్‌డ్‌ కోటా సీట్లు ఈ ఏడాది నుంచి రద్దయ్యాయి. రాష్ట్రంలో 2014కు ముందు ఏర్పాటైన అన్ని మెడికల్ కాలేజీల్లో 15 శాతం అన్‌రిజర్వ్‌డ్‌ కోటా సీట్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు పోటీపడేవారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి



తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ - మరి బీజేపీ జాడ ఎక్కడ ?
అసెంబ్లీలో అయినా బయట అయినా తెలంగాణలో  అధికార  పార్టీపై విరుచుకుపడుతోంది ఎవరు అంటే...   భారత రాష్ట్ర సమితి మాత్రమే.  అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, పార్లమెంట్ ఎన్నికల్లో సగానికిపైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం,  కేసీఆర్ ఫీల్డ్‌లోకి వచ్చేందుకు తటపటాయించడం, ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ మారడం వంటి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా బీఆర్ఎస్ .. కాంగ్రెస్ పై పోరాటంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. బీఆర్ఎస్ పని అయిపోయిందని ఎంత మంది చెబుతున్నా..  ఆ పార్టీ హైకమాండ్ మాత్రం..  పూర్వ వైభవం సాధిస్తామన్న నమ్మకంతోనే ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


వీహబ్‌లో రూ.42 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన అమెరికా సంస్థ
గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో చిన్నచిన్న మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమేగాక...వారికి శిక్షణ చేయూతనిస్తున్న  వీ హబ్‌ కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.తెలంగాణకు పెట్టుబడుల సాధించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి(Reavanth Reddy) బృందం సమక్షంలో వీ హబ్‌లో పెట్టుబడులకు ఓ భారీ ఒప్పందం జరిగింది. తెలంగాణ ఆర్థిక అభివృద్ధి కోసం పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికా పర్యటన చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి... భారీ పెట్టుబడులే లక్ష్యంగా పలువురితో భేటీ అవుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక నిధులు- అమ్మ ఆదర్శ కమిటీలకు పనులు అప్పగింత
ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయడం సహా...పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏపీలో వైసీపీ(YCP) హయాంలో అమ్మఒడి నిధుల నుంచే కోత విధించి చెల్లింపులు చేయగా... తెలంగాణలో మాత్రం ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నెలకు రూ.3వేల నుంచి రూ.20 వేల రూపాయలు చెల్లించనుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు సర్కార్ బడి అంటే కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న గదులు, ప్రహరీ లేని ఆటస్థలాలే దర్శనమిచ్చాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి