YouTube Academy in Andhra Pradesh :   ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్ అకాడెమీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు యూట్యూబ్ ను ఆహ్వానించారు. యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ APAC హెడ్ సంజయ్ గుప్తాలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు. లోకల్ పార్టనర్లతో కలిసి యూట్యూబ్ అకాడెమీ ఏర్పాటు చేయాలని ఆయన వారిని ఆహ్వానించారు. కంటెంట్, స్కిల్ డెలవప్‌మెంట్, ఏఐ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వంటి వాటిపై ప్రత్యేకంగా అకాడెమీలో పరిశోధనలు చేయవచ్చన్నారు. అమరావతిలో భాగమైన మీడియా సిటీలో దీన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆహ్వానించారు. 


 






యూట్యూబ్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మారుతోంది. ప్రపంచంలోని అన్ని  దేశాల్లో యూట్యూబ్ కంటెంట్ అప్ లోడ్ అవుతోంది. గూగుల్ వెబ్ సైట్ సమాచారానికి.. యూట్యూబ్.. వీడియో సమాచారానికి వేదికగా మారింది. కంటెంట్ క్రియేటర్లకు డబ్బులు వస్తూండటంతో ఉపాధి పొందేవారు కూడా ఎక్కువగా మారారు. క్వాలిటీ కంటెంట్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నార. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో యూట్యూబర్లకు ప్రత్యేకమైన శిక్షణతో పాటు కంటెంట్ క్రియేషన్‌లో సాయం చేసేందుకు యూట్యూబ్ అకాడెమీలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనను యూట్యూబ్ మాతృ సంస్థ గూగుల్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ విషయం తెలియడంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు.                                                         


యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో పాటు గూగుల్ ఉన్నతాధికారితో వెంటనే కనెక్ట్ అయ్యారు. వారితో ఆన్ లైన్ చర్చల్లో.. అమరావతిలో చేపట్టబోయే మీడియా సిటీ గురించి వివరించారు. ఇక్కడ ఉండే మ్యాన్ పవర్, ఇతర విషయాల గురించి సంపూర్ణంగా వివరించారని.. ప్రభుత్వ సాయం కూడా..  పూర్తి స్థాయిలో ఉంటుందని  భరోసా ఇచ్చారు. గూగుల్ పేరెంట్ కంపెనీ అల్ఫా బెట్ సీఈవోగా భారతీయుడు సుందర్ పిచాయ్ ఉన్నారు. దీంతో ఈ ప్రతిపాదనను వేగంగా ముందుకు తీసుకెళ్లగలమని ఏపీ ప్రభుత్వం అనుకుంటోంది.                       


అమరావతిలో  జాతీయ, అంతర్జాతీయ  ఐటీ కంపెనీలను నెలకొల్పేలా చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది అధికారులకు  ఈ పని మీద ప్రత్యేకంగా  బాధ్యతలు అప్పగించినట్లుగా చెబుతున్నారు.