కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భారతదేశం మరో మైల్‌స్టోన్ అందుకుంది. దేశంలో వ్యాక్సినేషన్‌కు అర్హత ఉన్న వారిలో (అడల్ట్స్) 50 శాతం మంది మొదటి డోస్ టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.





కోవిషీల్డ్ వ్యాక్సిన్ గ్యాప్‌పై పునరాలోచన..
కోవిషీల్డ్ వ్యాక్సిన్ గడువుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రస్తుతం కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మధ్య ఉన్న 84 రోజులు గడువును తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఇదే విషయాన్ని ఎన్టీఏజీఐ (NTAGI) సమావేశంలో చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని ఇప్పటికే కేంద్రం రెండు సార్లు మార్చింది. వ్యాక్సినేషన్ మొదలుపెట్టిన తొలి రోజుల్లో కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి 4 నుంచి 6 వారాలు ఉండాలని నిర్ణయించింది. ఆ తర్వాత మే నెలలో వ్యాక్సిన్ల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. వ్యాక్సిన్ల మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటేనే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని తెలిపింది.


Read More: Covishield Vaccine: కోవిషీల్డ్ వ్యాక్సిన్ 84 రోజుల గ్యాప్‌పై కేంద్రం పునరాలోచన.. వ్యవధి తగ్గే ఛాన్స్


దేశంలో కొత్తగా 46,164 కేసులు..
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,164 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్నటితో పోలిస్తే కేసుల్లో 22.7 శాతం మేర పెరుగుదల కనిపించినట్లు తెలిపింది. ఇక గత 24 గంటల్లో కోవిడ్ బాధితుల్లో 607 మంది చనిపోయినట్లు పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారికి బలైన వారి సంఖ్య మొత్తం 4,36,365కి చేరింది. గత 24 గంటల్లో 34,159 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3.17 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం 3,33,725 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


Also Read: Explosion Outside Kabul airport: కాబూల్‌లో జంట పేలుళ్లు.. 13 మంది మృతి!


Also Read: AP Covid Cases: ఏపీలో కొత్తగా 1,539 కరోనా కేసులు.. 12 మంది మృతి