కోవిషీల్డ్ వ్యాక్సిన్ గడువుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మధ్య గడువు 84 రోజులుగా ఉంది. దీనిని తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఇదే విషయాన్ని ఎన్టీఏజీఐ (నేషనల్ టెక్నికల్ అడ్వైసరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ - NTAGI ) సమావేశంలో చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ రూపొందించింది. మన దేశంలో ప్రస్తుతం ఎక్కువ మందికి ఇదే వ్యాక్సిన్ అందిస్తున్నారు. దీని ద్వారా రెండు డోసుల వ్యాక్సిన్ ఇస్తున్నారు. రెండు డోసుల మధ్య 84 రోజుల వ్యవధి ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని ఇప్పటికే రెండు సార్లు మార్చారు. వ్యాక్సినేషన్ మొదలుపెట్టిన తొలి రోజుల్లో (జనవరిలో) కోవిషీల్డ్ రెండో డోసుల మధ్య వ్యవధి 4 నుంచి 6 వారాలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత మే నెలలో వ్యాక్సిన్ల మధ్య వ్యవధిని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈసారి 12 నుంచి 16 వారాలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. వ్యాక్సిన్ల మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటేనే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Also Read: Covid 19 India Cases: కరోనా కేసుల్లో భారీ పెరుగుదల.. కొత్తగా 46,164 కేసులు
Also Read: AP Covid Cases: ఏపీలో కొత్తగా 1,539 కరోనా కేసులు.. 12 మంది మృతి