ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 67,590 శాంపిళ్లను పరీక్షించగా 1,539 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20,07,730కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం చిత్తూరు (243), తూర్పు గోదావరి (228), కృష్ణా (194), నెల్లూరు (176), పశ్చిమ గోదావరి (163) జిల్లాల్లో నమోదయ్యాయి.






గత 24 గంటల్లో కోవిడ్ బారిన పడిన వారిలో 12 మంది కన్నుమూశారు. వీరితో కలిపి రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,778కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 1,140 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో రికవరీల సంఖ్య 19,79,504కి పెరిగినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఏపీలో ప్రస్తుతం 13,778 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 2,63,37,946 నమూనాలను వైద్య, ఆరోగ్య శాఖ పరీక్షించింది.


దేశంలో కొత్తగా 46,164 కేసులు..
దేశంలో కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. కొత్తగా 46,164 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రితం రోజుతో పోలిస్తే కేసుల్లో 22.7 శాతం మేర పెరుగుదల కనిపించినట్లు తెలిపింది. ఇక గత 24 గంటల్లో 607 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి కోవిడ్ మహమ్మారికి బలైన వారి సంఖ్య మొత్తం 4,36,365కి చేరింది. తాజాగా 34,159 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3.17 కోట్లకు చేరింది. ప్రస్తుతం 3,33,725 మంది కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. 


Read More: Covid 19 India Cases: కరోనా కేసుల్లో భారీ పెరుగుదల.. కొత్తగా 46,164 కేసులు


Also read: Rape Case : భార్యకు ఇష్టం లేకుండా శృంగారం చేసినా రేప్ కాదు... చత్తీస్‌ఘడ్ హైకోర్టు కీలక తీర్పు.. !