దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 46,164 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 22.7 శాతం మేర పెరుగుదల కనిపించింది. మరో 607 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 4,36,365 మంది మహమ్మారికి బలయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.






కొత్త కేసులు: 46,164


కొత్త మరణాలు: 607


మొత్తం కేసులు: 3,25,58,530


మొత్తం రికవరీలు: 3,17,88,440


యాక్టివ్ కేసులు: 3,33,725


మరణాల సంఖ్య: 436365 


తాజాగా 34,159 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.17 కోట్లకు చేరాయి. క్రియాశీల రేటు మళ్లీ ఒక శాతం దాటింది. ప్రస్తుతం 3,33,725 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. 


కేరళలో విజృంభణ..


 


కేరళలో కొత్తగా 31,445 కరోనా కేసులు నమోదయ్యాయి. 215 మంది వైరస్ తో మరణించారు. మరో 20,271 మంది కరోనా నుంచి కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 19.03%గా ఉంది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.





దేశ వ్యాప్తంగా గత మూడు నెలలుగా నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే వచ్చాయి. ఇది వైద్య శాఖ నిపుణులను, కేరళ ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కానీ కేరళలో మాత్రం కరోనా కొత్త కేసులు స్థిరంగా ఉన్నాయి. రోజూ 30 వేల కేసులు దగ్గర వస్తున్నాయి.




60 కోట్ల టీకా డోసుల పంపిణీ.. 


దేశంలో ఇప్పటి వరకు 60 కోట్ల 38 లక్షల కరోనా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 80,40,407 మంది టీకా వేయించుకున్నారు.