గుజరాత్‌లో వింతైన ఓ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అసహజ రీతిలో లైంగిక చర్యలో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కండోమ్ మర్చిపోయిన అతడు దాని బదులు ఉపయోగించిన ఓ వింత పదార్థమే ఆ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ విషయం బాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల జూన్ 23న ఈ ఘటన జరగ్గా అసలు విషయం తాజాగా అసలు విషయం తెలిసింది. గుజరాత్‌కు చెందిన స్థానిక వార్తా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుజరాత్‌ అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కండోమ్‌కు బదులుగా ఓ జిగురులాంటి పదార్థాన్ని వాడి తన భాగస్వామితో లైంగిక చర్యలో పాల్గొన్నాడు.


అహ్మదాబాద్‌కు చెందిన సల్మాన్‌ (25) అనే యువకుడు జూన్‌ 23న తన ఇంటి సమీపంలోని పొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించారు. అయితే, సల్మాన్ మరణంపై అనుమానాలు తలెత్తినా.. అతను ప్రమాదవశాత్తు మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావించారు. కానీ, తర్వాత పోలీసులు  చేసిన విచారణలో అంతా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. అతడు అసహజంగా లైంగిక చర్యలో పాల్గొనడం వల్లే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.


Also Read: Minister Malla Reddy:  తొడగొట్టిన మంత్రి మల్లారెడ్డి.. ఓకే అయితే చెప్పు రేపే రాజీనామా చేద్దామని రేవంత్ రెడ్డికి సవాల్


అసలు కారణం ఏంటంటే..
కొన్ని జాతీయ వార్తా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. సల్మాన్ అనే 25 ఏళ్ల వ్యక్తి జూన్ 22న తన ప్రియురాలితో కలిసి ఓ హోటల్‌కు వెళ్లాడు. అయితే, కండోమ్ వెంట తీసుకెళ్లడం మర్చిపోయాడు. దీంతో సల్మాన్ తన భాగస్వామి గర్భం దాల్చకుండా ఉండేందుకు అందుబాటులో ఉన్న ఓ జిగురు పదార్థం పూసి తన మర్మాంగాన్ని సీల్ చేశాడు. అందులోని రసాయనాల ప్రభావం తీవ్రంగా ఉండడంతో అతడి మర్మాంగం సహా కీలక అవయవాలు చెడిపోయి చనిపోయాడు. కండోమ్‌ వెంట తీసుకెళ్లడం మర్చిపోవడంతో గర్భం రాకుండా ఉండేందుకే అతను ఈ జిగురును వాడినట్లుగా పోలీసులు తేల్చారు. 


అయితే, చనిపోయిన వ్యక్తి సల్మాన్‌తోపాటు అతడి ప్రియురాలు కూడా మత్తు పదార్థాలకు బానిసలుగా ఉండేవారని పోలీసులు చెప్పారు. అహ్మదాబాద్ పోలీసులు మాట్లాడుతూ.. సల్మాన్‌ తాజా పోస్టుమార్టం రిపోర్డు రావాల్సి ఉందని, అది వస్తే ఈ విషయంపై మరింత స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు.


Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న Q న్యూస్ ఆఫీసులో సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలు.. ఏమేం సీజ్ చేశారంటే..


Also Read: Gold-Silver Price: తగ్గుతున్న పసిడి ధర, వెండి మాత్రం పైపైకి.. మీ నగరంలో నేటి తాజా ధరలు ఇవే..