ఇద్దరం రాజీనామా చేసి.. మళ్లీ పోటీ చేద్దామని రేవంత్ రెడ్డికి మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. నువ్వు ఓకే అంటే రేపే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మల్లారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఒక దొంగ అని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటాలన్నీ అబద్ధాలేనని చెప్పారు. పీసీసీ కూడా అలాగే తెచ్చుకున్నాడని ఆరోపించారు. మూడు చింతల పల్లి కేసీఆర్ దత్తత గ్రామమని..సీఎం కేసీఆర్ ఆ గ్రామాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు.
Jagan Bail CBI Court : "తీర్పు" సెప్టెంబర్ 15కి వాయిదా !
మూడు చింతలపల్లి మండలం మొత్తం టీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలే ఉన్నారని మల్లారెడ్డి చెప్పారు. ఆ గ్రామాన్ని అన్ని రకాలుగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశాడన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు దీక్ష చేసాడో తెలియదని మండిపడ్డారు. అనేక మందికి తాగునీళ్లు, పెన్షన్లు వస్తున్నాయని.. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తున్నాడని లబ్ధి పొందిన వాళ్ళు ఫ్లెక్సీలు, ప్ల కార్డ్స్ పెట్టి నిరసన తెలిపారని స్పష్టం చేశారు. అందుకు నన్ను అడ్డుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి అంటున్నాడని చెప్పారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వం పథకాలు లేని ఇల్లు లేదని.. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అమలు చేయలేదన్నారు.
Also Read: Traffic Police: ఇదేందయ్యా.. ఇదే.. ట్రాఫిక్ పోలీసులు బైక్ తోపాటు మనిషిని కూడా గాల్లోకి ఎత్తేసారుగా..
Nityananda Kailasa : నిత్యానంద "కైలాస"కు దగ్గరి దారి తెలిసిపోయింది..! ఇక పోలీసులు వెళ్తారా..?
అయితే ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తొడగొట్టి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు మంత్రి మల్లారెడ్డి. తాను కష్టపడి భూమి సంపాదించుకున్నానని.. దమ్ముంటే తన అవినీతిని నిరూపించాలని సవాల్ విసిరారు. ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దామన్నారు. రేవంత్ దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని ఆయన సవాల్ విసిరారు. రేవంత్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుని ఇంటికి వెళ్తానని చెప్పారు.