ట్రాఫిక్ రూల్స్ పాటించని వాళ్లపై ఈ మధ్య పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. పెద్ద పెద్ద నగరాలే కాదు.. చిన్న చిన్న పట్టణాల్లోనూ ట్రాఫిక్ ఎక్కువైంది. ట్రాఫిక్  క్లియర్ చేసేందుకు పోలీసుల అవస్థలు అన్ని ఇన్ని కాదు.  వన్ వే, నో పార్కింగ్, పార్కింగ్ జోన్, సిగ్నల్ పాయింట్, సెంట్రల్ పార్కింగ్ అంటూ రక రకాలుగా పట్టణాల్లోని ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు నియమాలు అమలుపరుస్తున్న మళ్లీ అదే కథ. 


ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే చాలానాలు రాయడం, బళ్లు సీజ్ చేయడం వంటివి జరుగుతున్నాయి. పట్టణాల్లో వన్ వే రోడ్లు ఉన్నా రాంగ్ రూట్ లో ప్రయాణించడం మనకే తెలుసు. నో పార్కింగ్ అనే బోర్డ్ కనిపించినా కూడా మనం అక్కడికెళ్లే పార్క్ చేస్తాం. పోలీసులు తీసుకునే చర్యలకు గురవుతున్నాం. అలానే నో పార్కింగ్ జోన్ లో బైక్ నిలిపిన ఓ వ్యక్తి.. పుణేలో పోలీసుల చర్యలకు గురయ్యాడు. చర్యలు అంటే.. మామూలుగా కాదు.. బండితోపాటు మనిషిని కూడా గాల్లోకి ఎత్తేశారు.


ఇంతకీ ఏం జరిగిందంటే.. 


పుణెలోని నానాపేత్ పరిసర ప్రాంతంలో సమర్త్ బ్రాంచ్ ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నో పార్కింగ్ జోన్ లో పెట్టిన వాహనాలను రికవరీ వ్యాన్ లోకి ఎక్కిస్తున్నారు. అయితే ఓ వ్యక్తికి చెందిన బైక్ ను క్రేన్ సాయంతో వ్యానులోకి ఎక్కిస్తున్న టైమ్ లో బైకర్ వచ్చి.. బండి మీద కూర్చున్నాడు. అప్పటికే క్రేన్ ఆ బండిని కొంతపైకి ఎత్తేసింది. ఆ బైక్ మీదున్న మనిషిని కూడా గాల్లోకి ఎత్తేశారు. బైక్ పై నుంచి కిందకు దిగాల్సిందిగా పోలీసులు కోరినా.. అతడు పట్టించుకోలేదు. అలాగే కూర్చున్నాడు.


 






ఇక చేసేది ఏమీ లేక బైక్‌ను, అతడితోపాటుగా రికవరీ వ్యాన్ లోకి ఎక్కించారు. బైక్‌ యజమాని క్షమాపణ చెప్పి.. ఫైన్ కూడా కట్టాడని పోలీసులు చెబుతున్నారు. అయితే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశించారు. 
"నేను ఆ వ్యక్తితో మాట్లాడాను. అతనికి ఎవరిపైనా ఫిర్యాదు లేదు. వాహనం అప్పటికే పైకి ఎత్తారు. అది గాలిలో ఉన్నప్పుడు, అతను పరిగెత్తుకుంటూ వచ్చి దానిపై కూర్చున్నాడు. ఇది అకస్మాత్తుగా జరిగింది. అక్కడి సిబ్బందిపై చర్యలు తీసుకున్నాం. "అని డీసీపీ రాహుల్ శ్రీరామ్ చెప్పారు.


Also Read: Bigg Boss 5 Telugu: ‘బిగ్‌బాస్-5’ బిగ్ అప్‌డేట్: క్వారంటైన్‌లో కంటెస్టెంట్లు.. టెలికాస్ట్ తేదీ ఇదేనా?


MAA Elections Date: ‘మా’ ఎన్నికల తేదీ ఖరారు.. పంతం నెగ్గించుకున్న చిరంజీవి