అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ లో జంట పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. కాబూల్ విమానాశ్రయం వెలుపల బాంబు పేలుడు సంభవించిన కొద్ది క్షణాల్లోనే మరో పేలుడు వార్త బయటకొచ్చింది. కాబూల్ సమీపంలోని హోటల్‌లో రెండో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ హోటల్‌లో అమెరికన్లు ఉన్నట్లు సమాచారం.






కాబూల్ విమానాశ్రయం వెలుపల ఈరోజు సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 72 మంది చనిపోయినట్లు తాలిబన్ల నేతలు ప్రకటించారు. మృతుల్లో 12 అమెరికా దళాలు సహా చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ ట్వీట్ చేశారు. క్షతగాత్రుల వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. 


ఇది ఆత్మాహుతి దాడి అని అమెరికా రక్షణ శాఖ భావిస్తోంది. కాబూల్ విమానాశ్రయంలోని అబ్బే గేల్ వద్ద ఆత్మాహుతి దాడి జరిగిందని అధికారులు చెబుతున్నట్లు అమెరికా నేషనల్ సెక్యూరిటీ కరెస్పాండెంట్ జెన్నిఫర్ గ్రిఫీన్ ట్వీట్ చేశారు. 


పేలుడు సంభవించిన సమయంలో తాను ఓ అఫ్గాన్ వ్యక్తితో మాట్లాడుతున్నానని యూకే పార్లమెంట్ సభ్యురాలు నస్ ఘని తెలిపారు. అతడు ఫోన్ మాట్లాడుతోన్న సమయంలోనే భారీ పేలుడు సంభవించిందని చెప్పారు. తనతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తి, అతడి కుటుంబం క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. 




జెన్నిఫర్ గ్రిఫీన్ ట్వీట్..









నస్ ఘని ట్వీట్.. 






 


ఈ దాడులకు పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అమెరికా రక్షణ దళాల లక్ష్యంగా దాడి చేసినట్లు పేర్కొంది.