ఎక్కడైనా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే పట్టుకుంటారు. మద్యాన్ని అక్రమమంగా తీసుకెళ్తే పట్టుకుంటారు. ఇంకా ఏమైనా నిషేధిత పదార్థులు తీసుకెళ్తే జైల్లో పెడతారు కానీ పిజ్జాలు... బర్గర్లు తీసుకెళ్తే కేసులు పెట్టి జైల్లో వేస్తారా..? వేస్తారు.! చాలా సీరియస్ నేరంగా పరిగణించి కఠిన సెక్షన్లు వారి మీద నమోదు చేస్తారు. అయితే ఇది ఎక్కడో దొంగ కేసులు పెట్టాలనుకుంటున్న చోట్ల కాదు చట్టాన్ని నిఖార్సుగా అమలు చేసే దేశంలో. ఆ దేశం న్యూజిలాండ్. Also Read : రష్యాలోని అత్యున్నత శిఖరంపై చంద్రుడి తేజం భువన్ జై
న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌లోని ఇటీవల ఓకారు ప్రవేశించబోయింది. అన్నింటితో పాటే పోలీసులు ఆ వాహనాన్నీ తనిఖీ చేశారు. అయితే అందులో పెద్ద ఎత్తున పిజ్జాలు, బర్గర్లు లాంటి వాటిని గుర్తించారు. అన్నీ కేఎఫ్‌సీ ప్యాకింగ్ ఉత్పత్తులు. తమను పోలీసులు పట్టుకోవడంతో వాటినితీసుకు వస్తున్న వాళ్లు వణికిపోయారు. పోలీసులు కూడా వాటిని స్వాధీనం చేసుకుని వారిని స్టేషన్‌కు తరలించారు. ఆ కేఎఫ్‌సీ ఉత్పత్తుల్ని జాగ్రత్తగా సీజ్ చేశారు. కంట్రీ స్టైల్లో అందులో డ్రగ్స్ పెట్టి సప్లయ్ చేయడం లేదు.. అవి నిజంగా కేఎఫ్‌సీ తినుబండారాలే. మరెందుకు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారంటే ... అక్లాండ్‌లో లాక్ డౌన్ అమలవుతోంది. Also Read : 'ప్లీజ్.. ఒక్క అవకాశం ఇవ్వండి'.. ఐరాసకు తాలిబన్ల లేఖ
కరోనా నిబంధనలు చాలా పటిష్టంగా అమలు చేసే న్యూజిలాండ్‌లో సిటీల వారీగా రూల్స్ ఉన్నాయి. ఇటీవల ఆక్లాండ్‌లో లాక్ డౌన్ విధించారు. ఎవరైనా సిటీలోకి ఎంటరవ్వాలంటే ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఆక్లాండ్‌లో అన్ని రెస్టారెంట్లు క్లోజ్ చేశారు. టేక్ అవేలు కూడా లేవు. బయట నుంచి కూడా ఎలాంటి ఆహార పదార్థాలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు ఆ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఇన్ని తెలిసి కూడా కేఎఫ్‌సీ తినుబండారు కారు నిండా వేసుకుని అక్లాండ్‌లోకి ఎంటరవడానికి ప్రయత్నించారు. అందుకే కటకటాల వెనక్కి వెళ్లారు. Also Read:Tumkur Condom Case: హైవేపై కండోమ్ కేసులో కళ్లుచెదిరే ట్విస్ట్.. సొరంగంలో శృంగార భోగాలు!
కరోనా మొదటి వేవ్‌ను న్యూజిలాండ్ తన పకడ్బందీ చర్యలతో అధిగమిచింది. ఓ దశలో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేని దేశంగా పేరు తెచ్చుకుంది. లాక్ డౌన్ అవసరం లేని దేశంగా మారింది. అయితే సెకండ్ వేవ్‌లో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత డెల్టా వేరియంట్ కూడా బయటపడింది. అందుకే అక్కడి ప్రభుత్వం ప్రజల్ని కాపాడుకోవడానికి కఠిన నిబంధనలు పెడుతోంది. రూల్స్ అందరికీ ఒక్క లాగానే ఉంటాయి. గతంలో ఓ మంత్రి రూల్స్ బ్రేక్ చేసి బీచ్ ఒడ్డునకు వెళ్లిన విషయం తెలియడంతో ఆయన పదవి ఊడిపోయింది. Also Read : మూడు రోజుల చిన్నారికి పాలు ఇస్తుంటే... ఆ రెస్టారెంట్ ఓనర్ వెళ్లిపొమ్మన్నాడు... కారణం అడిగితే...