దేశంలో వివాదం రేపుతున్న పెగాసస్ వ్యవహారంలో తాము వచ్చే వారం ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు గురువారం వెల్లడించింది. ఇప్పటికే పెగాసస్‌పై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కొన్ని పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. వాటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విషయం వెల్లడించారు. విచారణ కోసం ఒక ప్రత్యేక నిపుణుల కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయనుంది. 


Also Read: "చీర" దెబ్బకు దివాలా ! ఆ రెస్టారెంట్‌ శారీకి సారీ చెప్పకపోతే ఇక అంతే సంగతులు...


ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. నిజానికి పెగాసస్‌పై విచారణ గత వారమే జరగాల్సి ఉందని అన్నారు. కానీ, తాము ఈ కమిటీలో నియమించదల్చుకున్న నిపుణులు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ విచారణలో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదని అన్నారు. ‘‘పెగాసస్ విషయంలో గత వారమే మేం ఆదేశాలు ఇవ్వాల్సింది. కానీ, ఏర్పాటు చేయదల్చుకున్న కమిటీలో నియమించాలనుకున్న సభ్యులు కొంత మంది ఇందులో ఉండేందుకు నిరాసక్తి చూపారు. అందుకు వ్యక్తిగత కారణాలు చూపారు. అందుకే ఆలస్యం జరిగింది. వచ్చే వారం కల్లా సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి వారితో కమిటీ నియమిస్తాం. వారికి కీలక ఆదేశాలిస్తాం’’ అని ప్రధాన న్యాయమూర్తి రమణ వెల్లడించారు.


Also Read: 'మోదీజీ.. భాజపాను రాష్ట్రంలోనే కాదు దేశంలోనే లేకుండా చేస్తా'


పెగాసస్‌ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సెప్టెంబరు 13న సుప్రీంకోర్టు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అయితే, అప్పుడే మధ్యంతర ఉత్తర్వులను రిజర్వు చేసింది. కోర్టు ఆదేశిస్తే నిపుణుల కమిటీతో విచారణ చేయిస్తాం కానీ, వ్యక్తుల ఫోన్లపై నిఘా ఉంచడానికి పెగాసస్‌ కానీ, ఇతరత్రా ఏదైనా సాఫ్ట్‌వేర్‌ కానీ ఉపయోగిస్తోందా? లేదా? అని చెప్పే అఫిడవిట్‌ దాఖలుకు కేంద్రం మరోసారి విముఖత వ్యక్తం చేసింది. దీంతో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను చెప్పాలని తాము అడగట్లేదని.. చట్టప్రకారం అనుమతించే మార్గాల్లో కాకుండా, ఇతర మార్గాల్లో ఆ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించారా? లేదా? అన్నది తెలుసుకోవాలని తాము భావిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.


Also Read: భారత ఆరోగ్యమంత్రికి డబ్ల్యూహెచ్ఓ కృతజ్ఞతలు.. కారణమిదే


Also Read: పేపర్ ఏస్తే తప్పేంటి.. కష్టపడితేనే ఫ్యూచర్ సూపరుంటది.. పేపర్ బాయ్ మాటలకు కేటీఆర్ ఫిదా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.