భారతీయ జనతా పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. భాజపాను దేశంలోనే లేకుండా చేస్తానని దీదీ అన్నారు. భవానీపుర్‌లో జరిగిన బహిరంగ సభలో దీదీ మాట్లాడారు.
నరేంద్ర మోదీ జీ, అమిత్ షా జీ.. భారత్‌ను తాలిబన్ దేశంగా మార్చాలనుకుంటే కుదరదు. భారత్.. ఎప్పుడూ ఐకమత్యంగా ఉంటుంది. గాంధీ, నేతాజీ, వివేకానంద, సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్, గురునానక్, గౌతమ్ బుద్ధా, జైన్లు.. ఇలా అందరూ ఐకమత్యంగానే సాగారు. భారత్‌ను విభజించాలని ఎవరైనా చూస్తే సహించే ప్రసక్తే లేదు. - మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
భాజపా ఓ అసత్య పార్టీ అని మమతా ఆరోపించారు. దుర్గా పూజ, లక్ష్మీ పూజకు బంగాల్‌లో అనుమతి లేదని భాజపా అసత్యాలు చెబుతుందని దీదీ విమర్శించారు. భాజపాను దేశంలోనే లేకుండా చేస్తానన్నారు దీదీ.
ఈ ఏడాది జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మమతా బెనర్జీ దూకుడు పెంచారు. భాజపా, మోదీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా సర్కార్‌ను గద్దె దించడమే తన లక్ష్యమని దీదీ అంటున్నారు.
Also Read: Saree No Entry : "చీర" దెబ్బకు దివాలా ! ఆ రెస్టారెంట్ శారీకి సారీ చెప్పకపోతే ఇక అంతే సంగతులు ...