మనిషి చావుకు కారణాలు అనేకం ఉంటాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వంటి పలు కారణాలతో జీవితంపై విరక్తి చెంది కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. ఇక కొంత మంది చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలిస్తుంటారు. క్షణికావేశంలో వారు చేసే పనుల వల్ల తల్లిదండ్రులకు జీవితాంతం క్షోభ మిగులుతుంది. కోడి గుడ్డు దోశకు డబ్బులు ఇవ్వలేదనే కారణంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం తలారివారిపల్లికి చెందిన దివంగత రమణయ్య కుమారుడు సాయి కిరణ్ (21) ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి కిరణ్ బి.కోత్తకోట సమీపంలోని వేము ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సాయి కిరణ్‌ చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో గారాబంగా పెంచారు. చిన్నప్పటి నుంచి చలాకీగా ఉండే సాయి కిరణ్.. చదువులో‌నూ తోటి విద్యార్థుల కంటే ముందుండే వాడు. ఈ రోజు ఉదయం సాయి కిరణ్ కోడి గుడ్డు దోశ‌కు డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను అడిగాడు. వారు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై గొడవకు దిగాడు. కోపంతో మొబైల్ ఫోన్ ఇంట్లోనే వదిలి బయటికి వెళ్లాడు. కోపం తగ్గాక వస్తాడని భావించిన కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా ఉండి పోయారు.



Also Read: Crime News: హత్య చేసి కూడా ఏం యాక్టింగ్.. అయినా హంతకుల్ని పచ్చరాయి ఉంగరం పట్టించేసిందిలా..


కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన సాయి కిరణ్.. గ్రామానికి సమీపంలోని గుర్రప్పకుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అక్కడ సమీపంలో పొలం పనులు చేస్తున్న వ్యక్తులు గమనించి కేకలు వేస్తుండగానే.. అతను కుంటలో దూకాడు. అప్రమత్తమైన కూలీలు.. సాయి కిరణ్‌ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. అప్పటికే మృతి చెందాడు. వెంటనే వారు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సాయి కిరణ్  మృతదేహాన్ని వెలికి తీశారు. శవాన్ని పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. 


Also Read: Kothagudem: రహస్యంగా ప్రేమ పెళ్లి.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ఫ్యామిలీ, అసలు సంగతి తెలిసి అఘాయిత్యం


Also Read: Mahabubabad: భర్త ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన భార్య, ఆ వెంటనే ఇంకో ఘాతుకం.. కారణం ఏంటంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి