టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీల విచారణ నేటితో ముగియనుంది. బుధవారం తరుణ్‌ విచారణ ముగియగానే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్.. ఏ బాంబు పేలుస్తుందోనన్న భయంతో టాలీవుడ్ వణికిపోతోంది. ఎక్సైజ్ శాఖ విచారణలో సెలబ్రిటీలకు క్లీన్ చీట్ లభించినా.. ఈడీ ఎంక్వైరీలో ఎలాంటి వివరాలు బయటకు వస్తాయోననే ఆందోళన వెంటాడుతోంది. ఇప్పటికైనా ఈ కేసు కొలిక్కి చేరుతుందా? లేదా కొనసాగుతుందా అనే టెన్షన్ వెంటాడుతోంది. 


ఈడీ ఇప్పటికే 11 మంది సెలబ్రిటీలను విచారించింది. ఈ రోజు విచారణ కోసం తరుణ్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు. మనీలాండరింగ్‌, ఫెమా యాక్ట్‌ ఉల్లంఘన, బ్యాంకు లావాదేవీలు, కెల్విన్‌తో సంబంధాలు తదితర అంశాలపై అధికారులు విచారిస్తున్నారు. 2017లో ఎక్సైజ్‌ విచారణలో సైతం తరుణ్ స్వచ్ఛందంగా తన సాంపిళ్లు ఇచ్చాడు. అయితే, తరుణ్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ కూడా క్లీన్ చీట్ ఇచ్చింది. 


Also Read: విశాల్ ఆ ఊపుడేంది? తెలుగు డబ్బింగ్‌పై ఫన్నీ వీడియో వదిలిన హీరో


ఇటీవల ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించిన చార్జ్‌షీట్‌ను రంగారెడ్డి కోర్టులో దాఖలు చేసింది. ఈ సందర్భంగా మరోసారి టాలీవుడ్ సెలబ్రిటీలకు క్లీన్ చీట్ ఇచ్చింది. నిందితులు, సాక్షుల్లో సెలబ్రిటీల పేర్లను చేర్చలేదు. కెల్విన్ మాటలు నమ్మశక్యంగా లేవని, అతడు చెప్పిన వివరాల ఆధారంగా సెలబ్రిటీలను నిందితులుగా చేర్చలేమని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలేవీ లభించలేదని తెలిపారు.


Also Read: టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. కెల్విన్ నిజాలు చెప్పడం లేదా? ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన


కెల్విన్ సినీ తారలు, విద్యార్థులు, హోటల్ నిర్వాహకులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ అమ్మినట్లు వాగ్మూలం ఇచ్చాడని పేర్కొన్నారు. అతడు చెప్పిన వివరాల మేరకు సిట్ ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చి విచారించినట్లు అందులో పేర్కొన్నారు. మరి, ఎక్సైజ్ శాఖ చార్జిషీట్‌ను ఈడీ పరిగణనలోకి తీసుకుంటుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఈడీ సెలబ్రిటీల లావాదేవీలన్నీ పరిశీలించింది. ఒక్కొక్కరినీ ఏడు నుంచి ఎనిమిది గంటలు విచారించింది. మరి, ‘డర్టీ పిక్చర్’కు శుభం కార్డు పడుతుందో లేదో చూడాలి. 


Also Read: ‘నాగార్జున’ అనేసి నాలుక కరుచుకున్న సమంత.. ఆ తర్వాత ‘మామ’ అంటూ ట్వీట్, సామ్‌కు ఏమైంది?


Also Read: ప్రభుత్వం ఆధీనంలో సినిమా టికెట్లు.. లాభం ఎవరికీ? ఇక బెనిఫిట్ షోలు ఉండవా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి