హీరో విశాల్ విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవ్వుతున్నాడు. తాజాగా ‘ఎనిమీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే తమిళంలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాల్ డబ్బింగ్ పనులు మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా విశాల్ తెలుగులో డబ్బింగ్ చెబుతున్న వీడియోను పోస్ట్ చేశాడు.
ఈ వీడియోలో విశాల్ తన చేతులను ఆడిస్తూ డబ్బింగ్ చెబుతూ ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. ‘‘ట్రాఫిక్ కానిస్టేబుల్‌లా చేతులు ఆడిస్తేనే నేను తెలుగు డబ్బింగ్ చెప్పగలను’’ అని తెలిపాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగువాడైన విశాల్ తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి ఇన్ని కష్టాలు పడుతున్నాడా అని నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. విశాల్ తండ్రి జీకే రెడ్డి నిర్మాత అనే సంగతి తెలిసిందే. విశాల్ తెలుగు కుటుంబానికి చెందినవాడైనా.. అతడు పుట్టింది, పెరిగింది తమిళనాడులో. దీంతో విశాల్‌కు పూర్తిగా తెలుగురాదు. అయితే, అతడికి తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. దీంతో తాను నటిస్తున్న ప్రతి చిత్రాన్ని తెలుగులో అనువాదిస్తూ తన లక్ పరీక్షించుకుంటున్నాడు.
వీడియో:
Also Read: ప్రియాంకా చోప్రాకి థ్యాంక్స్ చెప్పిన సమంత, వైరల్ అవుతున్న పిగ్గీచాప్స్, సామ్ ట్వీట్స్
‘నోటా’ ఫేమ్ ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విశాల్, ఆర్యలు శత్రువులుగా కనిపిస్తారు. విశాల్ సరసన మిర్నాలిని రవి హీరోయిన్‌గా కనిపించనుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. విశాల్ ‘సామాన్యుడు’ చిత్రంతోనూ తెలుగు ప్రేక్షకులన అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనేది ఈ చిత్రం ట్యాగ్ లైన్. ఈ చిత్రం ద్వారా శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌తో స్వయంగా విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో విశాల్ సరసన డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తోంది. యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పి.ఎ. తులసి, రవీనా రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.