నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ''రౌడీ బాయ్స్''. యూత్ పుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆశిష్ సరసన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టైటిల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ఆశిష్ లుక్ అదిరిపోయిందని…ఈ కాలేజ్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అవుతుందని ట్వీట్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ అండ్ యాక్షన్ డ్రామా అని టీజర్ చూడగానే అర్థమైపోతోంది. 'కాలేజ్ అనేది వండర్ ఫుల్ ప్లేస్.. ఇక్కడే మీరు ఎవరు ఏమిటి ఏమవుతారనేది డిసైడ్ అవుతుంది.. కాలేజ్ మీకు చదువు తో పాటుగా జీవితాన్ని నేర్పిస్తుంది' అని చెప్పే డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. స్టూడెంట్స్ మధ్య గ్యాంగ్ వార్స్.. వేర్వేరు కాలేజీలకు చెందిన ఆశిష్ - సాహిదేవ్ విక్రమ్ ఇద్దరూ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కోసం గొడవ పడటం చూపించారు. టీజర్ ఆఖర్లో రౌడీ ఎవర్రా అది అనగానే ‘రౌడీ బాయ్స్’ అని స్టూడెంట్స్ అరవడంతో టీజర్ ఎండ్ అయింది.
రౌడీబాయ్స్ టీజర్ ఇక్కడ చూడండి
మొదటి సినిమా అయినప్పటికీ ఆశిష్ స్క్రీన్ పై ఎనర్జిటిక్ గానే కనిపించాడు. అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లవ్ అండ్ యాక్షన్ మిక్స్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ పై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 'రౌడీ బాయ్స్'' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
Also Read: గుడ్‌న్యూస్! దిగొచ్చిన పసిడి ధర, స్థిరంగా వెండి.. తాజా రేట్లు ఇవి..
Also Read: ఈ రాశుల ఉద్యోగస్తులకు ఈ రోజంతా శుభసమయమే, ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ALos Read: నేడే ఏపీ ఎడ్‌సెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
Also Read: తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు.. ఆ జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచన..