కొన్ని రోజుల క్రితమే రానా, వెంకటేష్ కలిసి నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కాని అది సినిమానా, వెబ్ సిరీస్ అన్న క్లారిటీ రాలేదు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా క్లారిటీ ఇచ్చేసింది. పాపులర్ అమెరికా వెబ్ సిరీస్ ‘రే డోనోవన్’ఆధారంగా ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేసినట్టు చెప్పింది. దానికి ‘రానా నాయుడు’ అని పేరు కూడా డిసైడ్ చేశారు. ఇది క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. రానా, వెంకీ మొదటి లుక్ ను విడుదల చేశారు. అందులో వెంకీ వయసు ఎక్కువ ఉన్న వ్యక్తిలా కనిపిస్తుంటే, రానా యువకుడిలా దర్శన మిస్తున్నాడు. అందుకే వీరిద్దరు తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారని అనుకుంటున్నారు సినీ ప్రియులు. 


రానా నాయుడు సిరీస్ పై రానా తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. తాను ఎప్పటినుంచో బాబాయితో స్క్రీన్ పంచుకోవాలని భావించానని, తన కల ఇప్పటికి నెరవేరిందని పోస్టు పెట్టారు. అంతేకాదు ‘నేను బాబాయ్ ని ఆఫ్ స్క్రీన్ లో ఎంతగా ప్రేమిస్తున్నానో... రానా నాయుడులో కూడా అంతగా ప్రేమగా కనిపిస్తాం’ అని చెప్పుకొచ్చారు. 


వెంకీ కూడా రానా నాయుడు పోస్టర్ పోస్టు చేసి స్పందించారు. ‘రానా నా కళ్ల ముందే చిన్నపిల్లాడి నుంచి మంచి నటుడిగా ఎదిగాడు’ అని చెప్పుకొచ్చారు. త్వరలో నెట్ ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ రాబోతోందని తెలిపారు. 


వీరిద్దరి ఆన్ స్క్రీన్ కాంబినేషన్ కోసం తెలుగు సినీ అభిమానులంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇది తెలుగుతో పాటూ హిందీ, తమిళంలో కూడా విడుదల కాబోతోంది. 



Also read: ఒలింపిక్ విజేతతో బాలీవుడ్ బ్యూటీ బ్యాడ్మింటన్ మూమెంట్...
Also read: సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ట్రైలర్ అదుర్స్... విడుదల ఎప్పుడంటే... చిరు ట్వీట్
Also read: యాసిడ్ - జాన్వి డెస్టినేషన్ పెళ్లి... విందులో చికెన్ బిర్యానీ, ట్రెండవుతున్న పెళ్లి వీడియో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి