సినిమా రివ్యూ : స్లమ్ డాగ్ హజ్బెండ్
రేటింగ్ : 2.5/5
నటీనటులు : సంజయ్ రావు, ప్రణవి మానుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి, 'ఫిష్' వెంకట్,  మురళీధర్ గౌడ్, వేణు పొలసాని తదితరులు
ఛాయాగ్రహణం : శ్రీనివాస్ జె రెడ్డి
సంగీతం :  భీమ్స్ సిసిరోలియో
సహ నిర్మాతలు : చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల
నిర్మాత : అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి
రచన, దర్శకత్వం : ఏఆర్ శ్రీధర్
విడుదల తేదీ: జూలై 29, 2023


నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా నటించిన సినిమా 'స్లమ్ డాగ్ హజ్బెండ్' (Slumdog Husband Movie). బాలనటిగా కొన్ని సినిమాలు, ఆ తర్వాత సీరియళ్లు చేసిన ప్రణవి మానుకొండ (Pranavi manukonda)కు కథానాయికగా తొలి చిత్రమిది. కుక్కతో హీరో పెళ్లి - ఈ కాన్సెప్ట్ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ తీసుకొచ్చింది. మరి, సినిమా ఎలా ఉంది?


కథ (Slumdog Husband Movie Story) : లచ్చి అలియాస్ లక్ష్మణ్ (సంజయ్ రావ్) పార్శీగుట్ట పోరగాడు. మౌనిక (ప్రణవి మానుకొండ)తో ప్రేమలో ఉంటాడు. ఫోనులో రొమాంటిక్ డిస్కషన్లు పెడితే హీరో తల్లితో సమస్య. పార్కులకు వెళితే పోలీసులతో ప్రాబ్లమ్. లాభం లేదనుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే... ఇద్దరి జాతకాలు ఉండవు. ఒకవేళ ఎవరి జాతకంలో అయినా దోషం ఉంటే ఇంట్లో ఎవరో ఒకరు మరణించవచ్చని పంతులు గారు చెప్పడంతో, గండం పోవడం కోసం బేబీ (కుక్క)ని పెళ్లి చేసుకుంటాడు లచ్చి. ఆ తర్వాత హ్యాపీగా మౌనికతో పెళ్లికి రెడీ అయితే... పీటల మీద ఉండగా పోలీసులు వస్తారు. 


బేబీ (కుక్క)ని పెళ్లి చేసుకుని మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయినందుకు కేసు కోర్టు వరకు వెళుతుంది. ఓ జంతువుతో పెళ్లి చట్టబద్దమేనా? కోర్టులో ఏం జరిగింది? లచ్చికి ఎన్ని కష్టాలు వచ్చాయి? కోర్టులో కేసు సాగుతుండటంతో ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటే మౌనిక ఏం చేసింది? చివరకు, లచ్చి - మౌనిక కలిశారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.  


విశ్లేషణ (Slumdog Husband Movie Review) : 'స్లమ్ డాగ్ హజ్బెండ్' ట్రైలర్ చూస్తే స్టార్టింగ్‌లో ఫోనులో సెక్సీ స్పీకింగ్ సీన్స్ ఉంటాయి. సినిమా స్టార్టింగ్‌లో కూడా ఆ తరహా సీన్లు ఉన్నాయి. ఒక సెక్షన్ ఆఫ్ (మాస్) ఆడియన్స్‌ను ఆ సీన్లు ఎంటర్‌టైన్ చేస్తాయి. కుక్కతో పెళ్లి కాన్సెప్ట్ స్టార్ట్ కావడానికి ముందు వచ్చే సీన్లు అన్నీ ఆ విధంగా ఉంటాయి. 


కుక్కతో పెళ్ళైన తర్వాత కొంత వరకు ఓకే. ఆ తర్వాత మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని అనుకుంటే... చప్పగా సాగింది. కోర్ట్ రూమ్ సీన్స్ అసలు ఎంటర్‌టైన్‌ చేయలేదు. కోర్ట్ రూమ్ డ్రామాలో కామెడీకి ఆస్కారం ఉంది. కానీ, దర్శకుడు ఫన్ జనరేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. బెటర్‌ కామెడీ సీన్స్‌ రాసుకోవచ్చు. కోర్టులో ఆ వాదనలు అన్నీ పేలవంగా ఉన్నాయి. స్క్రీన్‌ ప్లే, ఆ ట్విస్టుల అంత గొప్పగా ఏమీ లేవు. కుక్కకు భరణం ఇవ్వాలని అనడం, 'వెన్నెల' కిశోర్‌ వాయిస్‌ వెనుక ట్విస్ట్‌ను పేలవంగా తీశారు. యానిమల్ రైట్స్ సీన్ బావుంది. కుక్కల విశ్వాసం గురించి చెప్పే సీన్ కూడా! అయితే... కుక్కతో పెళ్లి కాన్సెప్ట్ క్రియేట్ చేసిన క్యూరియాసిటీ, సినిమాలో పెళ్లి తర్వాత సీన్లు క్రియేట్ చేయలేదు.


దర్శకుడిగా పరిచయమైన ఏఆర్ శ్రీధర్ రాసిన కాన్సెప్ట్ బావుంది. ట్రీట్మెంట్‌లో కామెడీ కోటింగ్ తక్కువైంది. రొమాంటిక్ సీన్స్ తీయడంలో పట్టు చూపించారు. ఆయన దర్శకత్వంలో మాస్ పల్స్ ఉంది. భీమ్స్ సిసిరోలియో పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. 'మౌనికా ఓ మై డార్లింగ్' తరహాలో రెట్రో సాంగ్ 'మేరే చోటా దిల్' కంపోజ్ చేశారు. వీడియో సాంగ్ విడుదలైన తర్వాత వైరల్ కావచ్చు. 'లచ్చి గాని పెళ్లి' సాంగ్ కూడా బావుంది. కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల ట్రెండీ సాంగ్స్ రాశారు. నేపథ్య సంగీతం ఓకే. కథకు తగ్గట్లు నిర్మాత అప్పిరెడ్డి ఖర్చు చేశారు. స్క్రీన్ మీద ప్రొడక్షన్ వేల్యూస్ కనిపించాయి. సినిమాటోగ్రఫీ బావుంది. 


నటీనటులు ఎలా చేశారు? : నటుడిగా సంజయ్ రావ్ (Sanjay Rao)కు సవాల్ విసిరే క్యారెక్టర్ కాదిది. అందువల్ల, పెద్దగా ఏమీ కష్టపడలేదు. ఈజీగా చేశారు. క్లైమాక్స్ & కోర్ట్ సీనులో ఎమోషన్స్ చక్కగా పలికించారు. 'స్లమ్ డాగ్ హజ్బెండ్' థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను ప్రణవి మానుకొండ సర్‌ప్రైజ్ చేస్తారు. ఇంతకు ముందు సినిమాలు, సీరియళ్ళలో క్యారెక్టర్లు చేసిన ప్రణవి వేరు, ఇందులో ప్రణవి వేరు. అసలు ఎటువంటి అందాల ప్రదర్శన చేయకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తో సన్నివేశాల్లో స్పైస్ డోస్ పెంచారు.


ప్రణవిది ఎక్స్‌ప్రెసివ్ ఫేస్. ఆమెకు మరిన్ని అవకాశాలు రావచ్చు. ఈ సినిమాలో మరో సర్‌ప్రైజ్ యాదమ్మ రాజు. కాస్త కామెడీ చేయడమే కాదు, ఎండింగ్ ట్విస్ట్‌తో ఝలక్ ఇచ్చారు. బేబీ (కుక్క) ఓనర్ రోల్ చేసిన వేణు పొలసాని కొన్ని సీన్స్‌లో కథను మలుపు తిప్పారు. సప్తగిరి, బ్రహ్మజీ తమ వంతు ప్రయత్నం చేశారు కానీ ఆ కోర్టు సీన్లలో కామెడీ పండలేదు. రఘు కారుమంచి, మురళీధర్ గౌడ్ తదితరులు రెగ్యులర్ రోల్స్ చేశారు.   


Also Read : 'బ్రో' రివ్యూ : ఎనర్జీతో అదరగొట్టిన పవన్ కళ్యాణ్ - మరి, సినిమా?


చివరగా చెప్పేది ఏంటంటే : ఒక సెక్షన్ ఆఫ్ (మాస్) ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే రొమాంటిక్ సీన్లు సినిమాలో ఉన్నాయి. ఫ్యామిలీ & క్లాస్ ఆడియన్స్, పెద్దలకు అవి నచ్చవు. కానీ, మాసెస్ & యూత్ ఎంజాయ్ చేయవచ్చు. కామెడీ సరిగా వర్కవుట్ కాలేదు. జస్ట్‌ కొన్ని సీన్స్‌ మాత్రమే నవ్వించాయి. పాటలు, కొన్ని నవ్వులు, ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ చూడటం కోసం ట్రై చేయవచ్చు. 


Also Read : 'హిడింబ' రివ్యూ : మనుషులను తినే గిరిజన జాతి మహానగరానికి వస్తే?










ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial