రాజ్యలక్ష్మి తులసి వాళ్ళ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళ మాటలు నమ్మొద్దు డబ్బు కోసం మంగళసూత్రం అమ్ముకున్నారే కానీ నీ దగ్గర డబ్బు తీసుకోలేదని దివ్య విక్రమ్ కి చెప్తుంది.


లాస్య: మీ వాళ్ళకి తల పొగరు చాలా ఎక్కువ. మనిషి మీద పగబడితే ఏదో ఒకటి చెప్పి తొక్కే వరకు వదలరు. అందుకు నేనే సాక్ష్యం. మీ హనీ మూన్ ప్లాన్ నేనే చేశానని చెడగొట్టారు. తనని నమ్మకు.. కూతురు, అల్లుడు అని చూడకుండా నీతో మందు తాగించారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకో


దివ్య: పిచ్చి పిచ్చిగా వాగకు నీ గురించి ఇక్కడ అందరికీ తెలుసు. నీకు ఎక్కడ గతి లేక మా ఇంట్లో పడి బతుకుతున్నావ్


రాజ్యలక్ష్మి: తప్పు పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు


దివ్య: కొంపలు ముంచే వాళ్ళని పక్కన పెట్టుకుంటారు కానీ నిజాయితీగా ఉండే మావాళ్ళని నమ్మరు. ఎన్నాళ్ళు మంచితనం ముసుగు వేసుకుని బతుకుతారు అత్తయ్య


విక్రమ్: మాటలు జారకు


Also Read: అక్క తుప్పు వదిలించిన చెల్లి- కావ్య ఇల్లు తాకట్టులో ఉందని తెలుసుకున్న రాజ్ విడిపిస్తాడా?


దివ్య: మీ అమ్మని అంత మాట అంటే ఆవేశం పొడుచుకువచ్చింది. మరి వీళ్ళు మా వాళ్ళని అంటే మౌనంగా ఉన్నావే


లాస్య: నీకు మీ అమ్మ పోలీకలే కాపురాన్ని చెడగొట్టుకోకు. మీ వాళ్ళకి దూరంగా ఉండు


దివ్య: నువ్వు ఎవరు ఆ మాట చెప్పడానికి


రాజ్యలక్ష్మి: అది నా మాట


బసవయ్య: మీ అమ్మ పద్ధతిగా ఉంటే పద్ధతిగా పెంచేది. పొగరెక్కి మొగుడిని వదిలేసింది. సంసారాన్ని గాలికి వదిలేసింది. నీకు అదే నేర్పిస్తుంది. అందుకే మీ అమ్మకి దూరంగా ఉండమని చెప్తుంది


దివ్య: మా అమ్మ దేవత


ప్రసన్న: అవును శని దేవత మా ఆయన అన్న దాంట్లో తప్పేముంది


దివ్య: అవునులే మీరు కూడా మావయ్యకి రెండో పెళ్ళాం కదా మొదటి పెళ్ళాం కాదు కదా


విక్రమ్: మా అమ్మని కామెంట్ చేయడానికి నీకు ఎంత ధైర్యం


దివ్య: మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం తప్పు అయితే అత్త రెండో పెళ్లి చేసుకోవడం కూడా తప్పే కదా


విక్రమ్: నోర్ముయ్ మీ నాన్న మొదటి పెళ్ళాం ఉండగానే మోజు పడి రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ మా నాన్న అమ్మ చనిపోతే వేరే దారి లేక తల్లి ప్రేమ అందించడం కోసం రెండో పెళ్లి చేసుకున్నాడు. నా మీద జాలి ప్రేమతో ఈ దేవత. తను నా జీవితంలోకి వచ్చింది. మా వాళ్ళని తప్పు పట్టకు మీ వాళ్ళతో పోల్చకు


దివ్య: మీ అమ్మ మంచితనం ఒక నాటకం తల్లి ప్రేమ ముసుగులో నీలో విషం నింపుతుంది అనేసరికి విక్రమ్ కొట్టేందుకు చెయ్యి ఎత్తుతాడు


రాజ్యలక్ష్మి: మీ ఇద్దరినీ ఇక్కడికి తీసుకొచ్చింది కలిసి బతకడానికి


దివ్య: ఇక చాలు అత్తయ్య నీ నాటకాలు. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. నీకు నామీద ప్రేమ తగ్గిపోయింది. నీకు నీ తల్లి ఎంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యం. నాకు, నా తల్లికి గౌరవం ఇవ్వని చోట నేను ఉండలేను. భర్తగా నా మనసు అర్థం చేసుకోలేని నీతో నేను కలిసి బతకలేను. ఈ ఇంట్లో నాకు ఇంత మంది శత్రువులు ఉన్నా నా భర్త నాతో ఉన్నాడని అనుకున్నా అది భ్రమ అని తేలిపోయింది. ఇక నేను యుద్ధం చేయలేను అలిసిపోయాను


Also Read: ఇంకెన్నాళ్ళు ఈ సా....గతీత- భవానీ ముందు అడ్డంగా బుక్కైన కృష్ణ, మురారీ


విక్రమ్: అంటే ఇన్నాళ్ళూ నీ ప్రేమ నటన అన్నమాట


దివ్య: నాది కాదు మీ అమ్మది నటన నిన్ను మోసం చేస్తుంది. అది నీకు తెలియడం లేదు నా మాటలు అర్థం కావడం లేదు. నీకు నీ అమ్మ మీద గుడ్డిగా నమ్మకం ఉన్నంత కాలం నేను నీతో పడుకోలేను. ఈ క్షణమే ఈ ఇల్లు వదిలి వెళ్లిపోతాను


దీంతో రాజ్యలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తుంది. ఇదంతా దివ్య వల్ల అని విక్రమ్ కోపం పెంచుకుంటాడు. తులసి రాజ్యలక్ష్మి మాటలు తలుచుకుని బాధపడుతుంది. తన కూతురి జీవితం నాశనం అయ్యిందని అంటుంది. నందు వచ్చి సర్ది చెప్పడానికి చూస్తాడు కానీ తులసి మాత్రం తప్పు మాజీ మొగుడి మీదకు తోస్తుంది. కూతురికి, అల్లుడికి అసలు మందు ఎందుకు తాగించారని నిలదీస్తుంది. అందరిలాగే తనని అపార్థం చేసుకుంటున్నావని అంటాడు.


నందు: రాజ్యలక్ష్మి దివ్య మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నా మౌనంగా ఉన్నాను. నువ్వు ఏం చెప్తే అది చేశాను, నేను మారిన మనిషిని


తులసి; క్షమించండి నేను అదుపు తప్పి మాట్లాడాను. జరగకూడని నష్టం జరిగిపోయింది. ఇది ఇంతటితో ఆగదు చాలా దూరం వెళ్ళింది


ఇంట్లో గోడవకు కారణం తనేనని రాజ్యలక్ష్మి నటిస్తుంది.


రాజ్యలక్ష్మి: మీ ఇద్దరినీ అత్తారింటి నుంచి తీసుకుని రావడం నేను చేసిన తప్పు తనకి క్షమాపణ చెప్తాను. మీ అత్తింటి వాళ్ళని నిందించడం తప్పు


విక్రమ్: అసలు కాదు అర్థం చేసుకోకపోవడం తన తప్పు


దివ్య: నేను మా అమ్మ వాళ్ళింటికి వెళ్తున్నా ఇక్కడ నుంచి నగలు, డబ్బులు ఏవీ తీసుకుని వెళ్ళడం లేదు. ఒకసారి నా బ్యాగ్ చెక్ చేసుకుంటే వెళ్తాను


రాజ్యలక్ష్మి: తను పుట్టింటికి నిజంగానే బయల్దేరింది తనను ఆపు


విక్రమ్: నీ మీద గౌరవం ఉంటే తను ఆగిపోతుంది. తనకి నీమీద ఏ మాత్రం గౌరవం లేదు