కళ్యాణ్, అప్పు రోడ్డు మీద జాగింగ్ చేస్తుంటే తన ఫ్రెండ్ ఒకడు కనిపించి స్వప్న చేసిన యాడ్ గురించి మాట్లాడి సూపర్ గా ఉందని అంటాడు. దీంతో కోపం వచ్చి అప్పు వాడిని కొట్టబోతుంటే కళ్యాణ్ ఆపుతాడు. మీ అక్క యాడ్ చేయడం తప్పని కళ్యాణ్ అంటాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అందరూ మౌనంగా ఉంటారు. రుద్రాణి ఏంటి ఇది సంతాప సభ ఉన్నట్టు ఉందని అంటుంది.


అపర్ణ: నీ కోడలు చేసిన దానికి మాటలు కూడా రావడం లేదులే


రుద్రాణి: నా కోడలు అంత పెద్ద తప్పు చేస్తే ఇంట్లో ఎందుకు ఉండనిచ్చారు. నేనేమైనా బతిమలాడుకున్నాన?


అపర్ణ: తప్పు చేసే వాళ్ళని ఇంట్లో నుంచి పంపించే పనైతే ముందు నిన్నే పంపించాలి


ఇంద్రాదేవి: అపర్ణ తప్పు అనలేదు. కోడలు తప్పు చేస్తే కడుపులో పెట్టుకుని మందలించాలి. అంతే కానీ ఇంట్లో నుంచి పంపించి కొడుకు జీవితాన్ని నాశనం చేయడం కాదు


Also Read: తెలివిగా పావులు కదుపుతున్న ముకుంద- భవానీకి నిజం చెప్పేసి కృష్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందా?


రుద్రాణి: ఈరోజు నా కోడలు చేసిన పనికి ఎంత మంది తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో మర్చిపోయారా


రాజ్: ఆ టాపిక్ ఈ పూటతో ముగింపు పలకండి. ఇక మీరెవరూ ఇబ్బందిగా ఫీల్ అవాల్సిన పని లేదు. ప్రాబ్లం సాల్వ్ చేశాను. ఆ యాడ్ తీసిన వాళ్ళకి రూ.30 లక్షలు ఇచ్చి టెలికాస్ట్ కాకుండా బ్యాన్ చేయించాను


ఇంద్రాదేవి: అయితే ఇక ఆ యాడ్ ఎందులోనూ రాదా?


రాజ్: రాదు నానమ్మ ఎందులోనూ రాదు


స్వప్న: కోపంగా రాజ్ మీద విరుచుకుపడుతుంది. ఆ యాడ్ ని బ్యాన్ చేయించావా? ఎవరిని అడిగి చేశావ్


రాజ్: నువ్వు ఎవరిని అడిగి చేశావ్


స్వప్న: అది నా పర్సనల్


రాజ్: నీ పర్సనల్ ఈ ఇంటి పరువు తీసేలా ఉండకూడదు


స్వప్న: నీకు అంత కష్టంగా ఉంటే చూడకు. అంతే కానీ నా విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదు


కావ్య: స్వప్న.. ఏంటే మాట్లాడుతున్నావ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఆయన నా భర్త తనని ఏమైనా అంటే మర్యాదగా ఉండదు. పళ్ళు రాలగొడతాను. నువ్వు ఒక ఆడదానివని, ఈ ఇంటి కోడలివని అన్నీ మర్చిపోయి వెళ్ళి పది మంది పది రకాలుగా మాట్లాడుకునేలా చేస్తే నా భర్త దాన్ని సరి చేసి నీ పరువు నిలబెట్టాడు. అలాంటి మనిషిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? నాలుక కోసేస్తాను జాగ్రత్త


స్వప్న: నేను నీ అక్కని అనే సంగతి మర్చిపోతున్నావ్


కావ్య: నోర్ముయ్ నా భర్తకి విలువ ఇవ్వని ఆడది అక్క అయితే ఏంటి కుక్క అయితే ఏంటి. ఎటువంటి ఇంటికి కోడలిగా వచ్చావో తెలుసా? ఇన్ని చేసినా నిన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని నీ అత్త అంటే తప్పు చేస్తే కడుపులో పెట్టుకుని దాచుకోవాలని అన్నారు. అటువంటి వాళ్ళతో ఎలా నడుచుకోవాలో తెలుసుకుని ప్రవర్తించు. ముందు నా భర్తకి సోరి చెప్పు


సోరి చెప్పేసి స్వప్న కోపంగా వెళ్ళిపోతుంది. కావ్యని చూసి ఈ అమ్మాయికి కోపం కూడా వస్తుందా అని అపర్ణ, ధాన్యలక్ష్మి ఆశ్చర్యపోతారు. స్వప్న గదికి వెళ్ళి అన్నీ విసిరేస్తూ రగిలిపోతుంది. ఇదే రైట్ టైమ్ రాజ్, కావ్య మీద కోపంతో రగిలిపోతుంది.. తనకి మరింత నూరిపోసి రెచ్చగొట్టమని రాహుల్ ని రుద్రాణి పంపిస్తుంది. కావ్య రాజ్ దగ్గరకి వచ్చి యాడ్ బ్యాన్ చేయించినందుకు థాంక్స్ చెప్తుంది. ఫ్యామిలీ పరువు కోసం యాడ్ తీయించేశానని థాంక్స్ ఏమీ వద్దని అంటాడు. సరే అయితే నా థాంక్స్ నాకు ఇచ్చేయమని అంటుంది. అది ఎలా కుదురుతుందని అంటాడు. మళ్ళీ సాటి మనిషి దగ్గరకి వచ్చి కాసేపు రాజ్ ని ఆడుకుంటుంది. స్వప్న గాజులు తీసుకొచ్చి రాహుల్ కి ఇచ్చి వేసుకుని తిరగమని దెప్పిపొడుస్తుంది.


Also Read: రుద్రాణి ప్లాన్ అట్టర్ ఫ్లాప్, స్వప్న యాడ్ తీయించేసిన రాజ్ - అక్కా, చెల్లెళ్ల మధ్య వార్


స్వప్న: నేను నీ భార్యని. నేను నటించిన యాడ్ రాజ్ తీసేయిస్తుంటే చూస్తూ కూర్చున్నావ్. ఊరికే ఎందుకు ఈ గాజులు వేసుకుని కూర్చో. అంతకమించి ఇంకేం చేయగలవు. నీకు కనీసం ఇంట్లో మాట్లాడే స్వాతంత్ర్యం కూడా లేదు. అందుకే రాజ్ నా ఆశలని సర్వనాశనం చేశాడు


రాహుల్: రాజ్ ని మాత్రమే ఎందుకు అంటున్నావ్ మీ అక్క కూడా అందిగా. రాజ్ కి యాడ్ బ్యాన్ చేయించమని సలహా ఇచ్చింది కావ్య. తను నీ ఆశలకు అడ్డుగోడ కడుతుంది, తనే ఈ ఇంటి కోడలిగా చెలామణీ కావాలి. నేను మా అమ్మ నువ్వు ఈ ఇంట్లో ఉండటం తనకి ఇష్టం లేదు


స్వప్న: అర్థం అయ్యింది.. అది నాకు ఇంటి గౌరవం పేరుతో అడ్డు పడుతుంది. నేను ఎక్కడ సెలెబ్రెటీ అవుతానని కుళ్ళుతో ఈ పని చేయించింది. నేను ఏంటో చూపిస్తా


రాహుల్: కావ్య ఈ ఇంట్లో ఉన్నంత కాలం మనం బానిసలుగా బతకాలి


స్వప్న: నా వరకు వస్తే నా చెల్లి అని కూడా చూడను


కనకం ఇంటికి చంపక్ లాల్ తన అప్పు తీర్చమని బస్తీ పెద్దలని తీసుకుని వస్తాడు. డబ్బులు కట్టకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్తానని సేటు అనేసరికి పెద్దలు తిడతారు. డబ్బు మొత్తం ఒకేసారి కట్టాలంటే తమ వల్ల కాదని కనకం అంటుంది. ఆరు నెలల్లోపు మొత్తం డబ్బు కట్టకపోతే కిడ్నాప్ చేసిన వీడియో పోలీసులకి ఇచ్చి కేసు పెడతానని బెదిరిస్తాడు.