మురారీ, కృష్ణ అంతరాత్మలు వచ్చి ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమ చెప్పుకుంటారు. తమ మధ్య అడ్డు తెరలు తొలగిపోయాయని సంతోషంగా కౌగలించుకుంటారు. ఇక కాసేపటికి ఎవరి అంతరాత్మ వారిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ బాధ కంటిన్యూ చేస్తారు. భవానీ, ముకుంద మాట్లాడుకుంటారు.


భవానీ: కృష్ణ, మురారీ మధ్య ఏదో సమస్య ఉందని అనిపిస్తుంది. నీకేమైన చెప్పిందా?


ముకుంద: ఇదే కరెక్ట్ టైమ్ నిజం చెప్పాలని అనుకుంటూ ఉండగా రేవతి వస్తుంది.


రేవతి: కృష్ణ, మురారీ మధ్య ఏదో సమస్య ఉంది. కానీ అది ఏంటో తెలియదు, మీరే తెలుసుకోవాలి


భవానీ: నిజంగానే నీకు తెలియదా రేవతి. సమస్య తెలియకుండానే వ్రతం, హోమం చేయించావా? వాళ్ళ మధ్య ఏ సమస్య లేనప్పుడు ఎందుకు పూజలు చేయించి, ఫామ్ హౌస్ పంపించావ్


Also Read: రుద్రాణి ప్లాన్ అట్టర్ ఫ్లాప్, స్వప్న యాడ్ తీయించేసిన రాజ్ - అక్కా, చెల్లెళ్ల మధ్య వార్


రేవతి: వాళ్ళని ఫామ్ హౌస్ పంపించినట్టు నేను మీతో చెప్పలేదు మీకు ఎలా తెలిసింది


ముకుంద: నేనే చెప్పాను అత్తయ్య


రేవతి: అంత అవసరం ఏమొచ్చింది ముకుంద నీకు


భవానీ: చెప్తే తప్పు ఏంటి? వాళ్ళ మధ్య సమస్య లేకపోతే నువ్వు ఎందుకు ఇలా చేశావ్


రేవతి: వాళ్ళ మధ్య సమస్య ఉన్నట్టు నాకు అర్థం అయ్యింది. అదేదో మీరే తెలుసుకోండి. నేను వ్రతాలు చేయించింది వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని. వాళ్ళ మధ్య ఉన్న సమస్య తీర్చి ఇద్దరినీ ఒకటి చేయాలి. భార్యాభర్తల మధ్య విషయం ఎవరినీ ఏమి అడగాల్సిన అవసరం లేదు మీరే తెలుసుకోండి


ముకుంద ప్లాన్ ఫెయిల్ అవుతుంది. పెద్దత్తయ్యకి నిజాలు తెలిసేలా చేయాలని డిసైడ్ అవుతుంది. ఇక రేవతి ముకుందకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి నోరు మూయించాలని అనుకుంటుంది. ముకుంద గదిలోకి వెళ్ళి దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పెద్దత్తయ్యకి నిజం తెలిస్తే కృష్ణ వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తుందా అని అనుకుంటూ ఉండగా రేవతి తనతో మాట్లాడటానికి వస్తుంది.


రేవతి: నీ ప్రేమ నిజమైంది ఒప్పుకుంటాను. నీ ప్రేమకి హద్దులు లేకపోవచ్చు కానీ పెళ్లికి హద్దులు ఉంటాయి. ప్రతి కుటుంబంలో కట్టుబాట్లు ఉంటాయి. వాటికి అణుగుణంగా ఉండాలి


ముకుంద: నాకు విలువలు నేర్పించాలని అనుకుంటున్నారా? పెద్దత్తయ్యకి ఎక్కడ నిజం తెలుస్తుందోనని ఇలా ప్రేమగా మాట్లాడుతున్నారు కదా


Also Read: వేద మీదున్న ప్రేమని బయటపెట్టిన యష్- వసంత్ గర్ల్ ఫ్రెండ్ ని చూసేసిన చిత్ర


రేవతి: చెప్పు ఎవరికి చెప్తావో చెప్పు నువ్వు వాళ్ళని ఎప్పటికీ విడదీయలేవు


ముకుంద: అసలు వాళ్ళు కలిస్తేనే కదా విడదీయడానికి. వాళ్ళ మధ్య ప్రేమ ఉంటేనే కదా.. వాళ్ళకి ఒకరిమీద మరొకరికి ప్రేమ ఉంటే సన్మానంలో మురారీ ఉండకుండా వెళ్ళేవాడు కాదు. మురారీ తన భర్త అని కృష్ణ అనుకుంటే ఒంటరిగా స్టేజ్ ఎందుకు ఎక్కుతుంది జంటగా ఎక్కాలి కదా? ఇటు మురారీ కృష్ణ అంతగా పిలుస్తుంటే స్టేజ్ ఎందుకు ఎక్కలేదు. మిషన్ అనేది అబద్ధం కదా.. మురారీ కూడా కృష్ణని భార్యగా అంగీకరించలేదు కాబట్టి స్టేజ్ ఎక్కలేదు. వాళ్ళ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే. కృష్ణ దృష్టిలో మురారి తనకి జీవితం ఇచ్చిన దేవుడు మాత్రమే. అయినా మీకు చెప్పాను వాళ్ళిద్దరి మధ్య బలవంతపు ప్రేమ పుట్టించలేరు. మురారీకి నామీద ఉన్న ప్రేమని మీరే కాదు దేవుడు కూడా మరిపించలేడు


ఇంట్లో అందరూ సైలెంట్ గా కూర్చుని భోజనం చేస్తుంటే వాళ్ళ మూడ్ మార్చడానికి కృష్ణ ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. అంత పెద్ద గొడవ జరిగినా కూడా కృష్ణ మామూలుగా ఉందని అనుకుంటారు.