గుప్పెడంతమనసు జూలై 29ఎపిసోడ్ (Guppedanta Manasu July 29th Written Update)


శైలేంద్ర రూమ్ లో తిరుగుతూ ఫ్రస్ట్రేట్ అవుతాడు. జగతి-మహేంద్ర, రిషి-వసుధారని ఏమీ చేయలేకపోతున్నా భయపెట్టాలని డిసైడ్ అవుతాడు. ఇంతలో ధరణి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఆ చికాకులో ఉన్న శైలేంద్ర కాఫీ కప్పు విసిరికొడతాడు. అది చూసిన జగతి ఏంటి నువ్వుచూస్తున్నది అని నిలదీస్తుంది
జగతి: ధరణి ఒక్కసారి తిరిగబడితే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరిస్తుంది. నువ్వు అత్యాశకు పోతున్నావు
శైలేంద్ర: అత్యాశ అని నువ్వు అంటున్నావు అది నా స్థానం అని నేనంటున్నాను
జగతి: నీతీరు మానాన్నగారికి తెలియనంతవరకే..నా ధైర్యం ఏంటో నీకు తెలుసు. నాతో కానీ ఇంట్లో వాళ్లతో కానీ బుద్ధిగా ఉండు. కాలేజీ విషయాల్లో కలుగజేసుకోవద్దంటూ ధరణిని అక్కడినుంచి తీసుకెళ్లిపోతుంది
రిషిని తీసుకొచ్చి ఎండీ సీట్ లో కూర్చోబెట్టాలి అనుకుంటున్నారు కానీ అది జరగనివ్వను అనుకుంటాడు శైలేంద్ర
ధరణి: ఏంటి చిన్నత్తయ్యా పదవుల కోసం బంధాలు తెంపేసుకుంటున్నారని విన్నాను కానీ ఇప్పుడు కళ్లారా చూస్తున్నాను. క్రూర మృగాలలో అయినా జాలిదయ ఉంటాయి కానీ వీళ్లలో అవిలేవు. అందుకే మీ ధైర్యం చూసి నాకు భయం వేస్తోంది. ఇంక ఎంత రెచ్చిపోతారో, ఎలాంటి ఆంటకాలు సృష్టిస్తారో 
జగతి: బావగారికి భయపడతారు అదొక్కటే ధైర్యం
ధరణి: మీరు ఎంత చెప్పినా శైలేంద్ర తగ్గరు
జగతి: నిజమే 
ధరణి: మా ఆయన, అత్తగారు రిషిపై చేసే కుట్రలు, కుతంత్రాలు చూసి తట్టుకోలేకపోయాను, వాళ్లకు ఎదురుతిరుగుతాం అని అనుకున్నా ఏమీ మాట్లాడలేకపోయాను. నేను ఏం మాట్లాడినా మావయ్యగారికి తెలుస్తుందని ఆగిపోతున్నా. నా భర్త మీ కొడుక్కి మిమ్మల్ని దూరం చేశారని బాధపడ్డాను
జగతి: మన గెలుపు రిషిరావడం..అంతవరకే ఈ పోరాటం..
ధరణి: రిషి తొందరగా రావాలి చిన్నత్తయ్యా
జగతి: వచ్చేసమయం దగ్గరపడింది..వచ్చి ఈ తల్లి కన్నీళ్లు తుడుస్తాడు


ALso Read: రిషిని అల్లుడని పిలిచిన చక్రపాణి, షాకైన ఏంజెల్- మిస్టర్ ఈగో ఎంగిలి తాగి మురిసిన వసు


వసుధార ఇంటినుంచి వెళుతూ ఏంజెల్, రిషి కార్లో మాట్లాడుకుంటారు. ఓ మాట అడుగుతాను నిజం చెప్పు అని ఏంజెల్ అంటే అడుగు అంటాడు రిషి
ఏంజెల్: నీకు-వసుధారకి గతం ఉందా
రిషి: అగాథం ఉంది అనుకుంటాడు
ఏంజెల్: ఇంతాక వాళ్లింటికి వెళ్లినప్పుడు కూడా గమనించాను..మీ ఇద్దరి మధ్యా మాటల్లేవు కానీ  ఓ భగ్న ప్రేమికుల మధ్య ఉండే ఏమోషన్ ఉంది. నా గెస్ తప్పు అయితే క్షమించు కానీ నాకు అలా అనిపిస్తోంది. రిషి సైలెంట్ గా ఉండిపోవడం చూసి చెప్పు నిజం చెబుతాను అన్నావుగా
రిషి: ఫ్రెండ్స్ కి కూడా చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి..
ఏంజెల్: నా సీక్రెట్స్ అన్నీ నీకు చెప్పేశాను కదా
రిషి: అయితే నిన్ను ఓ విషయం అడుగుతాను
ఏంజెల్: నా పెళ్లి గురించి విశ్వం అడగడం మానేశాడు మరి నువ్వెందుకు అడుగుతున్నావు అని సైలెంట్ గా ఉండిపోతుంది
రిషి: చూశావా చెప్పలేకపోతున్నావు..అంతే ఎవరి వ్యక్తిగతం వాళ్లది. నా గతంలో వసుధార ఉందో లేదో అనవసరం కదా ...అలాగే నీ పెళ్లి గురించి కూడా అనవసరం. మనిద్దరి మధ్యా ఫ్రెండ్ షిప్ మంచిగా ఉందా లేదా అన్నదే కావాలి. నువ్వెప్పటికీ నువ్వు బెస్ట్ ఫ్రెండ్ వే అని పెద్ద క్లాస్ వేస్తాడు
ఏంజెల్: ఇంక నిన్ను ఎప్పుడూ ఏమీ అడగను.. కానీ తెలుసుకునే టైమ్ వచ్చినప్పుడు తప్పనిసరిగా తెలుసుకుంటాను
రిషి: తెలుసుకోవడానికి ఏమీ మిగల్లేదు ..ఎక్కువ శ్రమ పడకు అంతా భ్రమే అని అర్థమవుతుంది. ఈ విషయం వసుధార మేడంని అడిగావా
ఏంజెల్: అడగలేదు
రిషి: మంచిపని చేశావ్ అడిగితే కచ్చితంగా ఫీలవుతారు..
ఇద్దరి మధ్యా ఏమీలేకపోతే లేదని చెప్పేవాడు కానీ అలా చెప్పలేదంటే ఏదో గతం ఉండే ఉంటుందని మనసులో అనుకుంటుంది ఏంజెల్..


Also Read: షటప్ వసుధార అని ఫైర్ అయిన రిషి, పీక్స్ కి చేరిన టామ్ అండ్ జెర్రీ వార్!
రూమ్ లో కూర్చున్న జగతి ...రిషి మాటలు..మీటింగ్ లో శైలేంద్ర చేసిన రచ్చ గుర్తుచేసుకుంటుంది. ఇంతలో వచ్చిన మహేంద్ర ఏం ఆలోచిస్తున్నావని అడుగుతాడు
జగతి: మిషన్ ఎడ్యుకేషన్ రిషి టేకప్ చేస్తాడో లేదో..మరోవైపు శైలేంద్రకి అనుమానం వస్తే బావోదు. 
మహేంద్ర: శైలేంద్ర ప్రస్తుతం అన్నయ్య అన్న మాటలకు బాధపడతాడు కానీ ఇంకేం ఆలోచించడు
వీళ్ల మాటలు చాటుగా వింటున్న శైలేంద్ర నాకు మొత్తం తెలుసు అని అనుకుంటాడు...
వసుధారకి కాల్ చేసి విషయం కనుక్కుంటాను అన్నప్పటికీ జగతి మాత్రం ఆపేస్తుంది. విశ్వనాథంకి కాల్ చేస్తానన్నా ఆపేస్తుంది. మనం ఫోన్ చేసి అడిగిన విషయం రిషికి చెబుతారు..అప్పుడు రిషికి డౌట్ వస్తుందని క్లారిటీ ఇస్తుంది. రిషి నిర్ణయం చెప్పేదాకా వెయిట్ చేద్దాం అనుకుంటారు..
శైలేంద్ర: రిషిని రప్పించడం కోసం కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు కానీ నేనుండగా అది జరగనివ్వను కూడా మీ ప్రయత్నాలు మీవి నా ప్రయత్నాలు నావి...ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 


వీళ్ల ప్రతి అడుగు గమనిస్తున్నా..అన్నీ తెలిసినా ఏమీ చేయలేకపోతున్నాను..నా ప్రయత్నాలు విఫలమైపోతున్నాయి..ఏరోజో దక్కాల్సిన ఎండీ సీటు ఇప్పటికీ దక్కలేదు..ఇక ఎదురుచూపులు ఉండకూడదు ఏదో ఒకటి చేసి లాగేసుకోవాలి అనుకుంటాడు. ఇంతలో ఫోన్ రింగవుతుంది. ఏదైనా విషయం తెలిసిందా అని అడుగుతాడు. నిన్న రాత్రి రిషి-ఏంజెల్ ఇద్దరూ వసుధార మేడం ఇంటికి వెళ్లారు. బస్తీకి వెళ్లిన విషయంపై గొడవజరిగిందని చెబుతాడు అక్కడ కాలేజీ అటెండర్. వాళ్లిద్దరి గురించి బయటపెట్టాల్సిన సమయం వచ్చిందన్న శైలేంద్ర...రిషి-వసుధార రిసెప్షన్ ఆల్బమ్ తీసుకొచ్చి ఫొటో తీసి ఫోన్ కి పంపిస్తాడు. సినిమా రిలీజ్ టైమ్ లో పబ్లిసిటీ కోసం ఎలా అంటిస్తారో అలాగే అంటించాలని మాట్లాడుతుంటాడు...ఇంతలో జగతి ఆ వైపు వస్తుంది. శైలేంద్ర దగ్గరున్న ఏంగేజ్ మెంట్ ఆల్బమ్ చూసి షాక్ అవుతుంది...