కృష్ణ డైనింగ్ టేబుల్ దగ్గర హడావుడి చేస్తుంది. కానీ భవానీ మాత్రం మురారీ వాళ్ళ మధ్య సమస్య ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. కృష్ణ మురారీ గురించి ఆలోచిస్తుంది. తన బ్యాగ్ తీసుకుని బట్టలు సర్దుకుంటూ ఏడుస్తుంది.
కృష్ణ: నేను నాభర్తనే కదా ప్రేమించి ఆశలు పెంచుకుంది. ఆయన పెళ్లికి ముందు ఎవరినో ప్రేమిస్తే అది నా తప్పు ఎలా అవుతుంది. కానీ ఏసీపీ సర్ మనసులో నేను లేనని బాధ వేధిస్తుంది. ఎందుకు ఇలా చేశారని నిందించలేను.. అలాగని ఇంత ప్రేమ మనసులో దాచుకుని ఏమి లేనట్టు నటించలేను. కానీ ఇంత మంచి మనుషులని ఇన్ని రోజులు మోసం చేశానని గిల్టీగా ఉంది. మురారీ ఫోటో పట్టుకుని చూస్తూ బాధపడుతుంది. మిమ్మల్ని పెళ్లి చేసుకుని అగ్రిమెంట్ రద్దు చేసుకుని ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని చెప్పలేదు. కానీ ఇప్పుడు మీ మనసులో జీవితంలో నాకు చోటే లేదని తెలిశాక ఇక ఈ నిజం దాచి పెద్దత్తయ్య వాళ్ళని మోసం చేయలేను
Also Read: అక్క తుప్పు వదిలించిన చెల్లి- కావ్య ఇల్లు తాకట్టులో ఉందని తెలుసుకున్న రాజ్ విడిపిస్తాడా?
కృష్ణ, మురారీని విడదీసినందుకు ముకుంద తెగ సంబరపడిపోతుంది. నిజమైన ప్రేమికులు నాలాగా ప్రేమని నమ్ముకుంటారు. కానీ వాళ్ళు వాళ్ళనే నమ్ముకోవడం లేదు. ఇది అలుసుగా తీసుకుని వాళ్ళకి ఒకరంటే ఒకరికి ప్రేమ లేదని నమ్మించగలిగాను. ఇక అగ్రిమెంట్ విషయం కూడా పెద్దత్తయ్యకి చెప్పేస్తే మురారీ తన ప్రేమని చెప్పలేడు. కృష్ణని కూడా ఇంట్లో నుంచి పంపించేస్తారు. ఇక తను మా మధ్యలోకి రాకుండా నువ్వే చూసుకోవాలని దేవుడిని మొక్కుకుంటుంది. మురారీ డల్ గా కూర్చుని ఆలోచిస్తుంటే రేవతి వస్తుంది.
రేవతి: నీకు కృష్ణ అంటే ఇష్టమని నాకు తెలుసు. అలాంటిది అది అంత ప్రేమగా సన్మానంలో నీ గురించి గొప్పగా చెప్తూ పిలుస్తుంటే స్టేజ్ మీదకు ఎందుకు రాలేదు. మీ ఇద్దరి మధ్య గొడవ ఏమైనా జరిగిందా?
మురారీ: అలాంటిది ఏమి లేదమ్మా
రేవతి: నాకు తెలుసు మీ ఇద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అని.. ప్రేమ వేరు పెళ్లి వేరు గతాన్ని మర్చిపోవాలి
మురారీ: అంటే నేనింకా ముకుందని మర్చిపోలేకపోతున్నా అనుకుంటుందా?
రేవతి: నాకు తెలుసు మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది కానీ ఎందుకు ఇలా అయిపోతున్నారు. జరిగింది ఏదో జరిగిపోయింది అగ్రిమెంట్ రద్దు చేసుకుని కొత్త జీవితం ప్రారంభించండి
మురారీ: అమ్మా ప్లీజ్ తెలిసిన రోజే అన్నీ తెలుస్తాయ్
రేవతి: అంటే ఏంటి నువ్వు ఇంకా ముకుందని మర్చిపోలేకపోతున్నావా?
Also Read: తెలివిగా పావులు కదుపుతున్న ముకుంద- భవానీకి నిజం చెప్పేసి కృష్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందా?
మురారీ: నా గతానికి, వర్తమానానికి ఏం సంబంధం లేదు ఇంతకన్నా ఏం చెప్పలేను అర్థం చేసుకొమ్మా
కృష్ణ క్యాలెండర్ చూస్తూ తను వెళ్లాల్సిన టైమ్ దగ్గర పడిందని బాధపడుతుంటే మురారీ వస్తాడు.
కృష్ణ: ఇంకా నేను ఈ ఇంట్లో పన్నెండు రోజులు మాత్రమే ఉంటాను. మీలో చాలా మార్పు వచ్చింది తప్పించుకుని తిరుగుతున్నారు. మీకు నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదేమో మీ ఇష్టం. ఇంకొద్ది రోజుల్లో వెళ్లిపోతాను కదా అందుకే ఎవరి మీద డీపెండ్ అవకుండా ప్రాక్టీస్ చేయాలి కదా. డబ్బులు తీసి మురారీ చేతిలో పెడుతుంది. మీరు ఇప్పటి వరకు నాకోసం ఖర్చు పెట్టినవి ఇవి. నా గుర్తుగా ఈ డబ్బులు ఎప్పటికీ ఖర్చు చేయకుండా దాచుకుంటారా?
మురారీ: ప్లీజ్ కృష్ణ దయచేసి అలా మాట్లాడకు. ఐలవ్యూ.. నా మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు. నా ప్రేమ నీకు మాత్రమే సొంతం ఐలవ్యూ సో మచ్ అని చెప్పినట్టు ఊహించుకుంటాడు. నా మనసులో మాట చెప్పాలని ఉంది కానీ నువ్వు చూపించే కృతజ్ఞతని ప్రేమ అని ఎలా అనుకోవాలి. నేను ప్రేమతో కట్టిన ఫీజు కూడా రిటర్న్ చేస్తుంటే నేను ఏమనుకోవాలి. నువ్వు చాలా క్లారిటీతో ఉన్నావ్ నా ప్రేమని కూడా లెక్కకడతావ్ అనుకోలేదని మనసులో అనుకుంటాడు. నా గుర్తుగా ఈ డబ్బు నువ్వే ఉంచుకో
కృష్ణ: నేను మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను మీరు నా దేవుడు